కడపలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. అధికారులతో ప్రయాణికుల గొడవ

కడప రైల్వే స్టేషన్‌లో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. దీంతో రైల్వేశాఖ అధికారులకు, ప్రయాణీకులకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2021, 02:11 PM IST
కడపలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. అధికారులతో ప్రయాణికుల గొడవ

Tirumala express: రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 2000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్‌లో జరిగింది. 

ఏం జరిగిందంటే...
తిరుమల ఎక్స్‌ప్రెస్‌(Tirumala express) శనివారం ఉదయం వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరింది. విజయవాడకు వచ్చిన తర్వాత అధికారులు కడప జిల్లాలో భారీ వర్షాల(Heavy Rains) వల్ల రైల్వే వంతెన దెబ్బతిన్నాయని చెప్పారు. దీంతో ప్రయాణికులు అక్కడ దిగిపోయారు. కాసేపు తర్వాత రైల్వే అధికారులు వెళ్లొచ్చు అని ప్రకటించడంతో అందరూ మళ్లీ రైలు ఎక్కారు.

Also Read: ఉధృతంగా పెన్నా నది... వరదతో కోతకు గురైన హైవే... 5కి.మీ మేర ట్రాఫిక్ జామ్...

ఈరోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకున్న తర్వాత రాజంపేట మార్గంలో రైల్వే వంతెన(Railway bridge) దెబ్బతిందని రైలు వెళ్లదని చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీంతో రైల్వే అధికారులపై ప్యాసింజర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. స్పందించిన రైల్వే అధికారులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రయాణికులను బస్సులో తిరుపతి(Tirupati)కి పంపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News