AP Omicron cases: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్​ కేసులు

AP Omicron cases: ఆంధ్రప్రదేశ్​లోనూ ఒమిక్రాన్ భయాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. కొత్తగా ఇద్దరికి ఒమిక్రాన్​ వేరియంట్ నిర్ధారణ అయింది. కొత్త కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 07:29 AM IST
  • ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్​ కేసులు
  • మరో ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధారణ
  • విదేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తింపు
AP Omicron cases: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్​ కేసులు

AP Omicron cases: ఏపీలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా మరో రెండు కేసులు (Omicron new cases in AP) నమోదయ్యాయి. ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలిన ఆ ఇద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు ఆంధ్ర ప్రదేశ్​ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తాజా కేసులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు (Omicron cases in AP) పెరిగింది.

కొత్త కేసుల వివరాలు..

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అనంతపురంకు చెందిన మరో వ్యక్తి (51 ఏళ్లు) యూకే నుంచి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఆయా వ్యక్తుల కుటుంబాలకు కొవిడ్ టెస్టులో నెగెటివ్​గా తేలినట్లు వివరించారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల్లో కూడా శనివారం స్వల్ప వృద్ధి నమోదైంది. కొత్తగా 104 మందికి పాజిటివ్​గా (Corona cases in AP) తేలింది.

దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కలవరం..

దేశంలో ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 400కుపైగా కేసులు (Omicron cases in India) బయటపడ్డపాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో ఇప్పిటేకే కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్​గా తేలుతోంది. ఇది మరింత ఆందోళకరమైన విషయమని చెబుతున్నారు విశ్లేషకులు.

ఒమిక్రాన్​ భయాల నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమయ్యాయి. మరిన్ని రాష్ట్రాలు వాటిని అనుసరించే వీలుంది. కొత్త సంవత్సరం, పండుగల సీజన్​ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పలు నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి.

Also read: AP Corona cases: రాష్ట్రంలో 24 గంటలల్లో 104 కరోనా కేసులు

Also read: Sankranti special buses: సంక్రాతికి భారీగా స్పెషల్ బస్సులు- ఛార్జీలు బాదుడు కూడా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News