విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కుదరదు: కేంద్రం

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసింది.ఇదే విషయం మార్చి 12న జరిగిన రైల్వే అధికారుల రివ్యూ మీటింగులో చెప్పామని కూడా కేంద్రం ప్రకటించింది. 

Last Updated : Jul 28, 2018, 08:49 PM IST
విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం కుదరదు: కేంద్రం

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం మళ్లీ స్పష్టం చేసింది.ఇదే విషయం మార్చి 12న జరిగిన రైల్వే అధికారుల రివ్యూ మీటింగులో చెప్పామని కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవలే రాష్ట్ర విభజన చట్టంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్‌లో కేంద్ర హోంశాఖ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించింది. అలాగే విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో తెలిపినటు వంటి సంస్థల ఆస్తులు పంచలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇదే విషయంపై తన వైఖరిని తెలిపింది. 10వ షెడ్యూల్ ప్రకారం సంస్థల విభజనతో పాటు ఆస్తుల విభజన కూడా జనాభా ప్రాతిపదికిన పంచే అవకాశముంటుందని తెలిపింది.

అయితే హోంశాఖ పలు విషయాల్లో తమ అభ్యంతరాలను తెలిపింది. విజయవాడలో మెట్రోకి ఆమోదం తెలియజేయాలంటే.. నిబంధనలు నూతన మెట్రోకి అనుగణంగా ఉండాలని శాఖ తెలిపింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల రూపాయలకు మాత్రమే యూసీలు సమర్పించడం జరిగిందని.. అందుకే ఈ విషయంలో ఏమీ చేయలేమని కూడా శాఖ స్పష్టం చేసింది. 

అలాగే విడిపోయాక రాష్ట్రంలో అనేకమంది ఉద్యోగుల విభజన పెండింగ్‌లోనే ఉందని.. అలాగే సంస్థల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వ నిర్ణయాలు ఆమోద దశలోనే ఉన్నాయని హోంశాఖ తెలిపింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పలు వివాదాలు నడుస్తున్నాయని.. అవి పరిష్కారం అయితే తప్ప కొన్ని విషయాలలో కేంద్రం నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉందని కూడా హోంశాఖ సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

Trending News