EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. రేపే ఆఖరి తేదీ.. ఇలా చేయకపోతే PF రాదు

ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. రేపటిలోగా అనగా సెప్టెంబర్ 01 2021లోగా వారి పీఎఫ్ ఖాతాకు ఆధార్ నంబరు జతపరచకబోతే వారి పీఎఫ్ వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఎలా ఆధార్ లింక్ చేయాలో ఇక్కడ తెలుసుకోండి  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 11:53 AM IST
  • ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ కు రేపే చివరి తేదీ
  • లింక్ చేయకపోతే పీఎఫ్ డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు
  • ఎలా లింక్ చేయాలో ఇక్కడ తెలుపబడింది
EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. రేపే ఆఖరి తేదీ.. ఇలా చేయకపోతే PF రాదు

పార్లమెంట్ లో ఆమోదం పొందిన సోషల్ సెక్యురిటీ కోడ్ (Social security Code) నిబంధనల ప్రకారం, ఈపీఎఫ్  ఖాతాదారుల ఆధార్ నంబర్లను కేంద్ర కార్మిక శాఖ కోరింది. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర కార్మిక మంత్రిత్వ ఆదేశాల ప్రకారం, ఈపీఎఫ్ఓ అకౌంట్లకు ఆధార్ లింక్ తప్పనిసరి అయింది

గతంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (Employees' Provident Fund) వారు  ప్రకటించిన దాని ప్రకారం జూన్ 1 2021 లోపు పీఎఫ్ అకౌంట్ (PF account)కు ఆధార్ కార్డును (Aadhaar card) జతపరచాలి, కానీ యాజమాన్యాలు ఉద్యోగుల పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు రావడంతో ఈ గడువును సెప్టెంబర్ 1 2021 వరకు పొడిగించారు. కావున మీ ఈపీఎఫ్ కు ఆధార్ నెంబర్‌ను జోడించటం తప్పనిసరి. 

Also Read: September New Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఏంటో తెలుసా

సెప్టెంబర్ 1 లోగా అనగా రేపు సాయంత్రం వరకు అకౌంట్ కలిగిన వారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్  (Aadhar link) చేయాల్సిందే. కంపెనీ యాజమాన్యం తమ ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ లింక్ (Aadhar link for Epfo account) చేసేలా వారిని ప్రోత్సహించాలని ఈపీఎఫ్ఓ ఆదేశాలను జారి చేసింది. ఇచ్చిన గడువు లోపు ఆధార్ లింక్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 

ఇదివరకే తమ ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ వివరాలు లింక్ చేసిన వారు ఈ సారి మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు తమ ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ లింక్ చేయని వారు మాత్రమే తప్పనిసగా సెప్టెంబర్ 1 లోగా ఆధార్ వివరాలను జోడించాలని సూచిందింది. 

Also Read: Bigg Boss 5 Telugu: ఆగస్టు 15న సర్‌ప్రైజ్‌.. 22 నుంచి క్వారంటైన్‌లోకి కంటెస్టెంట్స్..!

ఎలా జోడించాలి??

  1. పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయటం సులువైన పద్దతి..
  2. మొదటగా ఈపీఎఫ్ ఖాతాదారులు అధికారిక వెబ్ సైట్   https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ద్వారా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేయాలి
  3. తరువాత యూఏఎన్ నెంబర్ (UAN Number), పాస్వర్డ్,  క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి
  4. పైన కనపడుతున్న ఆప్షన్ లలో  Manage పైన క్లిక్ చేయాలి
  5. Manage ఆప్షన్ కింద డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి
  6. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అందులో Aadhaar ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. 
  7. మీ ఆధార్ నంబర్ ను, పేరు మరియు ఇతర వివరాలను ఎంటర్ చేయాలి
  8. సేవ్ చేసిన తరువాత వివరాలు సరైనవ కావ అని మరోసారి చెక్ చేసుకోవాలి. 
  9. యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.
  10. అప్రూవ్ అయిన తర్వాత DetailsVerified అని కనిపిస్తుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News