Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌.. ఆఫర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ దేశంలో మరోసారి బిగ్ సేల్‌ ఫెస్టివల్ ను తీసుకు రాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్ లో అన్ని వస్తువులకు మంచి రాయితీ ఇవ్వనున్నారు. ఆగస్టు 5న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ ఆగస్టు 9 న ముగియనుంది. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2023, 04:34 PM IST
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌.. ఆఫర్లు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ లు ఇండియాలో మరోసారి బిగ్ సేల్‌ ఫెస్టివల్ ను తీసుకు రాబోతున్నారు. అమెజాన్ వారు గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్ తో అద్భుతమైన ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ప్రకటనలతో ఊరిస్తున్న అమెజాన్ అత్యధిక అమ్మకాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 5వ తారీకు నుండి ఆగస్టు 9వ తారీకు వరకు ఈ గ్రేట్‌ ఫ్రీడమ్ సేల్‌ ఉంటుంది. 

ఈ సేల్ ను ప్రైమ్ యూజర్లు ఒక రోజు ముందు నుండే పొందవచ్చు. ఇక్కడ ప్రైమ్‌ యూజర్లను పెంచుకునే ఉద్దేశ్యంతో అమెజాన్ వేసిన ప్లాన్‌ అద్భుతం అంటూ మార్కెట్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే కొన్ని సార్లు గ్రేట్‌ ఫెస్టివల్ ఆఫర్స్ అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తారు, తీరా చూస్తే అసలు అక్కడ ఆఫర్లే ఉండవు. అందుకే అమెజాన్ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ గురించి కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

మార్కెట్‌ వర్గాల వారు, టెక్ నిపుణులు మాత్రం ఈసారి జెన్యూన్ ఆఫర్లతో గ్రేట్‌ ఫ్రీడమ్ సేల్‌ ను వినియోగదారుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు. స్మార్ట్‌ ఫోన్స్‌ మొదలుకుని ల్యాప్ ట్యాప్స్‌ ఇంకా ఇతర గృహ అవసరాలకు వినియోగించే వస్తువులపై 40 నుండి 80 శాతం డిస్కౌంట్ ను అందించబోతుంది. 

అంతే కాకుండా ఎస్ బీ ఐ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేసిన వారికి మరో 10 శాతం వరకు తగ్గించనున్నట్లుగా ప్రకటించారు. మొత్తానికి ఈ గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్‌ తో మధ్య తరగతి వారికి చాలా వస్తువులు తక్కువ రేటుకు దక్కే అవకాశం ఉంది అంటున్నారు. ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ ఫోన్‌ లు అన్నీ కూడా చాలా తక్కువ రేటుకు ఈ సేల్‌ లో రాబోతున్నాయి. కనుక ఫోన్‌ లేదా టీవీ వంటివి కొనుగోలు చేసేందుకు కాస్త వెయిట్‌ చేయాల్సిన అవసరం ఉంది. 

Also Read: ITR Filing Deadline: ఐటీఆర్‌ ఫైలింగ్‌కు నేడే లాస్ట్ డేట్.. ఈ ఐదు తప్పులు చేయకండి   

అమెజాన్ వారు గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ లో భాగంగా స్పీకర్లు, హెడ్ ఫోన్స్ ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్‌ గూడ్స్ పై 75 శాతం వరకు తగ్గిస్తున్నట్లుగా ప్రకటన చేయడం జరిగింది. అంతే కాకుండా ఎస్‌ బీ ఐ తో పాటు మరి కొన్ని బ్యాంక్ కార్డుల ఆఫర్‌ లను కూడా అమెజాన్‌ ఇస్తుంది. యాపిల్ తో పాటు ప్రముఖ బ్రాండ్స్ కు చెందిన టాబ్లెట్లపై కూడా భారీ మొత్తం లో డిస్కౌంట్ ను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. 

ఇలాంటి ఆఫర్లు, డిస్కౌంట్ లు ముందు ముందు ఉండక పోవచ్చు అని, ఇదొక అద్భుతమైన ఆఫర్‌ ల సీజన్‌ కనుక తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా సంస్థ వినియోగదారులకు మెసేజ్ చేస్తుంది. టెక్ నిపుణులు కూడా ఈ ఆఫర్ లను సద్వినియోగం చేసుకోమంటూ సూచిస్తున్నారు.

Also Read: Weather Updates Today: రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News