ATF price hike: ఆల్​టైం హైకి విమాన ఇంధన ధరలు - కిలో లీటర్ రూ.లక్ష పైకి!

ATF price hike: విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్)​ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. బుధవారం పెంచిన రేట్లతో తొలిసారి కిలో లీటర్ ఏటీఎఫ్​ ధర రూ.లక్ష దాటింది. ముడి చమురు ధరలు భారీగా పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2022, 04:41 PM IST
  • రికార్డు స్థాయిలో పెరిగిన జెట్ ఫ్యూయల్ ధరలు
  • ఏటీఎఫ్ ధర సరికొత్త రికార్డు స్థాయికి
  • ముడి చమురు ధరల్లో వృద్ధే కారణం
ATF price hike: ఆల్​టైం హైకి విమాన ఇంధన ధరలు - కిలో లీటర్ రూ.లక్ష పైకి!

ATF price hike: చమురు మార్కెటింగ్ కంపెనీలు విమానాల్లో వాడే ఇంధన ధరలను భారీగా పెంచాయి. బుధవారం పెంచిన రేట్లతో దేశీయంగా ఏవియేషన్ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధర కిలో లీటర్​కు (1000 లీటర్లు) జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.లక్ష దాటింది. దేశంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏటీఎఫ్ ధరలు సవరించే విధానం అమలులో ఉంది. దీనితో తాజాగా ధరలను సవరించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా.. ఏటీఎఫ్​ ధరలను ఈ స్థాయిలో పెంచాయి.

తాజాగా ఎంత పెరిగాయి?

ఏటీఎఫ్ ధరలను 18.3 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్​ ధర రూ.1,10,666.29 వద్దకు చేరింది. ఇక కోల్​కతా, ముంబయి, చెన్నైలలో ఏటీఎఫ్​ ధరలు కిలో లీటర్​కు వరుసగా రూ.1.14 లక్షలు, రూ.1.09 లక్షలు, రూ.1.14 లక్షలుగా ఉంది.

ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణాలు..

రష్యా- ఉక్రెయిన్ మధ్య 20 రోజులకుపైగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీనితో బ్యారెల్ ముడి చమురు ధర ఇటీవల 140 డాలర్లు దాటింది. దీనితో దేశీయంగా ఏటీఎఫ్ ధరలను పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. గతంలో 2008 ఆగస్టులో బ్యారెల్ ముడి చమురు ధర 147 డాలర్లకు పెరిగినప్పుడు.. దేశీయంగా ఏటీఎఫ్ ధర కిలో లీటర్​కు రూ.71,028 వద్దకు చేరింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్థాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర బ్యారెల్​కు 100 డాలర్లుగా ఉండగా.. ఏటీఎఫ్​ ధర మాత్రం కిలో లీటర్​కు రూ.లక్ష దాటడం గమనార్హం.

ఏటీఎఫ్ ధర పెరిగితే ఏమవుతుంది?

ఏటీఎఫ్ ధర పెరిగితే.. విమానయాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. అంతర్జాతీయ విమానాలను పూర్తి స్థాయిలో నడిపించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చిన నేపథ్యంలో.. విమానయాన టికెట్ ధరలు తగ్గే అవకాశముందని వార్తలు వచ్చాయి. అయితే ఏటీఎఫ్ ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Also read: Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు- సెన్సెక్స్​ 1040 ప్లస్​

Also read: Redmi Note 10T 5G..17 వేల ఫోన్..కేవలం 199 రూపాయలకే, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News