Best SUV in India: మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు.. మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్!

Buy Mahindra XUV 700 car at same price of Maruti Brezza. మీరు మారుతి బ్రీజా (Maruti Brezza) ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ (Mahindra XUV 700) వంటి శక్తివంతమైన ఎక్స్‌యూవీని కూడా కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 7, 2023, 03:34 PM IST
  • బెస్ట్ ఎస్‌యూవీ కార్
  • మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్
  • మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు
Best SUV in India: మహీంద్రా మాత్రమే ఇలాంటి ఆఫర్ ఇవ్వగలదు.. మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్!

Best SUV Cars India 2023, Mahindra XUV 700 car buy at the price of Maruti Brezza: దేశంలోని ప్రముఖ ఎస్​యూవీ కార్లలో 'మారుతి బ్రీజా' (Maruti Brezza) ఒకటి. గతేడాది ఎక్కువగా అమ్ముడైన కార్లలో కూడా బ్రీజా ముందు వరసలో ఉంది. బ్రీజా ధర రూ. 8 లక్షల నుంచి మొదలై రూ. 14 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే మీరు మారుతి బ్రీజా ధరలో మహీంద్రా ఎక్స్‌యూవీ (Mahindra XUV 700) వంటి శక్తివంతమైన ఎక్స్‌యూవీని కూడా కొనుగోలు చేయవచ్చు. 

మహీంద్రా యొక్క ఎస్‌యూవీ కార్లకు భారత దేశంలో మంచి ఆదరణ ఉంది. 2022లో మహీంద్రా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి కూడా. ఇందుకు కారణం ఎస్‌యూవీ, ఎక్స్‌యూవీ మోడల్స్. మహీంద్రా ప్రత్యేకత ఏమిటంటే.. వాహనాల బేస్ వేరియంట్‌ల ధరలు సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంతలా అంటే.. మారుతి బ్రీజా ధరలో మీరు ఎక్స్‌యూవీ 700 కారును మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వాస్తవానికి మారుతి బ్రీజా టాప్ వేరియంట్ ధర రూ. 13.96 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా ఎక్స్‌యూవీ 700 బేస్ MX వేరియంట్ ధర రూ. 13.45 లక్షలు. మహీంద్రా ఈ ఎస్‌యూవీని 5 సీట్ల వేరియంట్‌లో విక్రయిస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. MX వేరియంట్‌లో మీకు 5 సీట్ల ఎంపిక మాత్రమే ఉంది. ఈ వేరియంట్ MG హెక్టర్ (MG Hector), టాటా హారియర్ (Tata Harrier) మరియు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) వంటి కార్లతో పోటీపడుతుంది.

ఈ వేరియంట్‌లో 2 లీటర్ టర్బో పెట్రోల్ (200PS మరియు 380Nm) మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ (185PS మరియు 450Nm) ఎంపికలు ఉంటాయి. డీజిల్ ఇంజిన్ వేరియంట్‌ను ధర రూ. 13.96 లక్షలుగా ఉంది. 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 17 అంగుళాల ఉక్కు చక్రాలు, ఆండ్రాయిడ్ ఆటో, స్మార్ట్ డోర్ హ్యాండిల్ వంటి  ఫీచర్లు ఉన్నాయి. 

MX వేరియంట్ ఫీచర్లు:
8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే
7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ ఆటో
స్మార్ట్ డోర్ హ్యాండిల్
LED టెయిల్లాంప్
స్టీరింగ్ మౌంటెడ్ స్విచ్
పవర్ సర్దుబాటు ORVM
17 అంగుళాల ఉక్కు చక్రాలు

Also Read: Best Electric Scooter: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఫుల్ ఛార్జ్‌తో 300 కిలోమీటర్లు! కరెంట్ బిల్ తక్కువే  

Also Read: Shash Mahapurush Yog 2023: జనవరి 17న శష యోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు! తరగని సంపద సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News