Elon Musk Sells Tesla Shares: టెస్లా షేర్లు అమ్మేసిన ఎలన్ మస్క్

అపరకుబేరుడు ట్విట్టర్ మీద మోజుతో టెస్లా కారు షేర్లను అమ్మేసుకున్నాడు. 4 బిలియన్‌ డాలర్ల ధర పలికే టెస్లా షేర్లను  అమ్మేశాడు. ట్విటర్‌ కొనుగోలుకు అవసరం అయిన నిధుల కోసం టెస్లై షేర్లు అమ్మేసినట్లు తెలుస్తోది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 04:15 PM IST
  • అపరకుబేరుడు ట్విట్టర్ మీద మోజుతో టెస్లా కారు షేర్లను అమ్మేసుకున్నాడు.
  • 4 బిలియన్‌ డాలర్ల ధర పలికే టెస్లా షేర్లను అమ్మేశాడు
  • మస్క్‌ కు టెస్లాలో 17 శాతం వాటా ఉంది
Elon Musk Sells Tesla Shares: టెస్లా షేర్లు అమ్మేసిన ఎలన్ మస్క్

Elon Musk sells almost $4bn-worth of Tesla shares: అపరకుబేరుడు ట్విట్టర్ మీద మోజుతో టెస్లా కారు షేర్లను అమ్మేసుకున్నాడు. 4 బిలియన్‌ డాలర్ల ధర పలికే టెస్లా షేర్లను  అమ్మేశాడు. ట్విటర్‌ కొనుగోలుకు అవసరం అయిన నిధుల కోసం టెస్లై షేర్లు అమ్మేసినట్లు తెలుస్తోది. ఏప్రిల్‌ 26, 27 తేదీల్లో ఎలన్ మస్క్ తన టెస్లా షేర్లను అమ్మేసుకున్నట్లు అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ తెలిపింది. 

ట్విటర్‌ కొనుగోలుకు అవసరం అయిన 44 బిలియన్‌ డాలర్లలో 21 బిలియన్‌ డాలర్లను సొంతగా సమకూర్చుకున్న ఆయన...మిగతా డబ్బును సమీకరించేందుకు టెస్లా షేర్లను విక్రయించాడు. తప్పనిసరి పరిస్థితులో టెస్లా షేర్లను అమ్మాల్సి వచ్చిందని ఎలన్ మస్క్ ప్రటించాడు. ఇకపై మిగతా షేర్లను అమ్మాల్సిన అవసరం తనకు లేదని తెలిపాడు. టెస్లా షేర్ హోల్డర్లు అనవసరంగా ఆందోళన చెంద వద్దని సూచించాడు. స్పెక్యులేషన్లకు తావు ఇవ్వకుండా ఇంత కాలం ఒపిక పట్టిన షేర్ హోల్డర్లు ఇకపై కూడా తనపై నమ్మకాన్ని ఉంచాలని విజ్ఞప్తి చేశాడు. 

మరోవైపు ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుచి టెస్లా షేర్ల విలువ పతనమవుతూనే ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం మస్క్‌ టెస్లా షేర్లను అమ్మేస్తారని మార్కెట్ విశ్లేషకులు ముందుగానే హెచ్చరించడంతో చాలా మంది షెర్ హోల్డర్లు ముందు జాగ్రత్త చర్యగా తమ షేర్లను అమ్ముకున్నారు. దీంతో షేర్ల విలువ దారుణంగా పతనమైంది. 
ఈ కరాణంగా  ఒక్కరోజే టెస్లా మార్కెట్‌ విలువ 126 బిలియన్ డాలర్లు పడిపోయింది. ఇంకా మస్క్‌ కు టెస్లాలో 17 శాతం వాటా ఉంది. టెస్లా షేర్ల విలువ దారుణంగా పతనం అవడంతో  మస్క్ ఏకంగా 40 బిలియన్‌ డాలర్లు నష్టపోవాల్సి వచ్చింది. ట్విటర్‌ కొనేందుకు ఆయన 21 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తే... కొన్నపాపానికి టెస్లాలో40 బిలియన్ డాలర్లు నష్టపోయాడు.

మరో వైపు ట్విట్టర్‌కు మస్క్ ఇంకా 17 బిలియన్ డాలర్లు  చెల్లించాల్సి ఉంది. ఇకపై టెస్లా షేర్లు అమ్మనని ప్రకటించిన మస్క్ మరి ఈ మొత్తాన్ని ఎలా సమీకరించుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అపరకుబేరుడైన మస్క్‌కు ప్రముఖ రాకెట్‌ సంస్థ స్పేస్‌ఎక్స్‌ లో 43.61 శాతం వాటాలున్నాయి. వీటి విలువ 100 బిలియన్‌ డాలర్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Also Read: Cooler Discount: ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారా? రూ. 20 వేల కూలర్... కేవలం 969 రూపాయలకే..! త్వరపడండి

Also Read: Vodafone Idea Plan: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ఆ ఫీచర్ ఇకపై అందుబాటులో ఉండదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News