EPFO ఖాతాదారులకు షాక్‌.. ఇకపై ఆధార్‌ కార్డు పనికి రాదు.. ఎందుకంటే..

EPFO Aadhaar Statement: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. జన్మదిన ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్‌ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఖాతాదారులు, సభ్యులు ఈ విషయాన్ని గమనించి వయసు నిర్ధారణ కోసం ఆధార్‌ కార్డు మినహా మిగతా కార్డులు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2024, 02:13 PM IST
EPFO ఖాతాదారులకు షాక్‌.. ఇకపై ఆధార్‌ కార్డు పనికి రాదు.. ఎందుకంటే..

Aadhar for EPFO: ఖాతాదారులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. వయసు నిర్ధారణ కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రాల్లో ఆధార్‌ కార్డును తొలగించింది. పుట్టిన తేదీ నిర్ధారణ కోసం ఆధార్‌ సరైన పత్రం కాదని పేర్కొంది. ఇప్పటి నుంచి జన్మదినం ధ్రువీకరణ కోసం ఇకపై ఆధార్‌ కార్డు సమర్పించాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో ఈపీఎఫ్‌ సంస్థ తెలిపింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈపీఎఫ్‌ మార్పులు చేసింది. 

'యూఐడీఏఐ నుంచి ఒక లేఖ వచ్చింది. పుట్టిన తేదీ నిర్ధారణ కోసం కావాల్సిన ధ్రువపత్రాల జాబితాలో నుంచి ఆధార్‌ కార్డును తొలగించాలని ఆదేశించింది' అని జనవరి 16వ తేదీన ఈపీఎఫ్‌ ప్రకటించింది. ఇక భవిష్యత్‌లో ఆధార్‌ కార్డు వయసు నిర్ధారణకు వినియోగించవద్దని పేర్కొంది. వయసు నిర్ధారణ కోసం సమర్పించాల్సిన ధ్రువపత్రాల జాబితాను ఈ సందర్భంగా ఈపీఎఫ్‌ సంస్థ వెల్లడించింది. 

పుట్టినతేదీ నిర్ధారణ కోసం అవసరమైన ధ్రువపత్రాలు

  • జన్మదిన ధ్రువపత్రం (బర్త్‌ సర్టిఫికెట్‌)
  • మార్కుల జాబితా
  • పాఠశాల బదిలీ ధ్రువపత్రం (టీసీ)
  • సివిల్‌ సర్జన్‌ ధ్రువీకరించిన మెడికల్‌ సర్టిఫికెట్‌
  • పాస్‌పోర్టు
  • పాన్‌ కార్డు నంబర్‌
  • ప్రభుత్వ పింఛన్‌ పత్రం
  • మెడిక్లయిమ్‌ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం
  •  

ఇటీవల యూఐడీఏఐ ఆధార్‌ కార్డులపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 22వ తేదీన ఓ ఉత్తర్వు విడుదల చేసింది. 'ఆధార్‌ నంబర్‌ వ్యక్తిగత గుర్తింపు కోసం ఉపయోగపడుతుంది. కానీ పుట్టినతేదీ నిర్ధారణకు ధ్రువపత్రంగా వినియోగించలేం' అని యూఐడీఏఐ ప్రకటించింది. ఆధార్‌ కార్డులో తరచూ మార్పులుచేర్పులు చేసుకునే అవకాశం ఉండడంతో జన్మదినం కూడా మార్చుకునే అవకాశం ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వ్యక్తుల పుట్టినతేదీ నిర్ధారణకు ఆధార్‌ కార్డు సరైన ధ్రువీకరణ పత్రంగా గుర్తించలేం అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ స్పష్టం చేసింది.

ఆధార్ గుర్తింపు కార్డే.. కానీ
యూఐడీఏఐ ఆదేశాలకు అనుగుణంగా ఈపీఎఫ్‌ కూడా పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డును వినియోగించడం లేదు. ఈపీఎఫ్‌ సభ్యులు, ఖాతాదారులు ఇకపై తమ వయసు నిర్ధారణ కోసం ఆధార్‌ కార్డు కాకుండా ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డు కేవలం వ్యక్తి గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ ఖాతాదారులు గమనించి కార్యాలయానికి వెళ్లేప్పుడు, కానీ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన సమయంలో ఆధార్‌ కార్డు కాకుండా ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. మరచిపోకండి.

Also Read EPFO Nominee Rules: పీఎఫ్ నామినీగా కొడుకు, కుమార్తెను చేర్చవచ్చా, ఎవరికి అవకాశం లేదు

Also Read EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News