iPhone13పై భారీగా డిస్కౌంట్, 22 వేలకు పైగా తగ్గింపు, ధర ఎంతంటే

iPhone13: ఐఫోన్ 13 కొనాలనుకుంటున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. ఇప్పుడు మీకు కావల్సిన ఐఫోన్ 13పై 22 వేలకు పైగా డిస్కౌంట్ లభించనుంది. అదెలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2022, 05:32 PM IST
 iPhone13పై భారీగా డిస్కౌంట్, 22 వేలకు పైగా తగ్గింపు, ధర ఎంతంటే

iPhone13: ఐఫోన్ 13 కొనాలనుకుంటున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే. ఇప్పుడు మీకు కావల్సిన ఐఫోన్ 13పై 22 వేలకు పైగా డిస్కౌంట్ లభించనుంది. అదెలాగంటే..

ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ నడుస్తోంది. ఈ సేల్ ఇవాళే ప్రారంభమైంది. ఇందులో యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించనుంది ఐఫోన్ 13. ఐఫోన్ 13పై మీకు 22 వేలకంటే ఎక్కువే డిస్కౌంట్ లభించనుంది. అదెలాగో చూద్దాం..

ఐఫోన్ 13 128 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ గురించి ఇది. ఇది మార్కెట్‌లో 79 వేల 9 వందలకు లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌పోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో 7 శాతం డిస్కౌంట్ అనంతరం 73 వేల 999 రూపాయలకు విక్రయిస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే..పది శాతం అంటే 750 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఐఫోన్ 13 మీకు 73 వేల 249 రూపాయలకు లభించనుంది. 

22 వేల డిస్కౌంట్ ఎలా

ఐఫోన్ 13 డీల్‌లో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే మీ పాత ఫోన్‌కు బదులు ఈ ఫోన్ కొనుగోలు చేస్తే..మీకు 15 వేల 5 వందల రూపాయలు తగ్గుతుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనం మీకు పూర్తిగా లభిస్తే..డిస్కౌంట్ తరువాత మీకు 57 వేల 749 రూపాయలకు లభించనుంది. అంటే ఈ ఫోన్‌పై మీకు 22 వేల 151 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. 

ఐఫోన్ 13 ఫీచర్లు

ఐఫోన్ 13 స్మార్ట్‌ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది ఏ15 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ కలిగి ఉంటుంది. 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇక కెమేరా అయితే..12 రెండు సెన్సార్లు 12 ఎంపీ కాగా, ఫ్రంట్ కెమేరా కూడా 12 ఎంపీ. డ్యుయల్ సిమ్ సౌకర్యంతో పాటు 1 ఏడాది వారంటీ ఉంది.

Also read: EPFO Interest Amount: మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు పడ్డాయా ? వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News