Flipkart REDMI 10 Offer: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రెడ్‌మీ 10పై రూ. 5 వేల తగ్గింపు! ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా

RS 5 Thousand offer on REDMI 10 Smartphone in Flipkart. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జులై 22) 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై 33 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 22, 2022, 04:25 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్
  • రెడ్‌మీ 10పై రూ. 5 వేల తగ్గింపు
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా
Flipkart REDMI 10 Offer: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రెడ్‌మీ 10పై రూ. 5 వేల తగ్గింపు! ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా

RS 5 Thousand offer on REDMI 10 Smartphone in Big Saving Days Sale: ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీ ఇండియా భారతదేశంలో రెడ్‌మీ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రెడ్‌మీ 10 మోడల్‌ను మార్చి నెలలో పరిచయం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో, Mi.comలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. అయితే ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ 10పై బంపర్ ఆఫర్ ఉంది. 'బిగ్ సేవింగ్ డేస్' సేల్లో భాగంగా రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 5 వేల తగ్గింపు ప్రకటించింది. ఈ ఆఫర్ కొద్ది గంటలు మాత్రమే మిగిలుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జులై 22) 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై 33 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. REDMI 10- 64 GB, 4 GB RAM అసలు ధర రూ. 14,999 ఉండగా.. రూ. 9,999 లకు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ 10 మొబైల్ 128 GB, 6 GB RAM వేరియంట్‌ అసలు ధర రూ. 16,999లు కాగా.. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్ ద్వారా 26% తగ్గింపు లభిస్తుంది. అప్పుడు 4 వేల రూపాయల తగ్గింపుతో రూ. 12,999లకు కొనుగోలు చేయవచ్చు.

మరోవైపు రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఇస్తే.. 64 GB, 4 GB RAM  వేరియంట్‌పై గరిష్టంగా రూ. 9,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. అదేవిధంగా 128 GB, 6 GB RAM వేరియంట్‌పై రూ. 11,750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. అంటే రూ. 1000 లోపు మీరు  రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ ఆఫర్ 

Redmi 10 స్పెసిఫికేషన్లు:
# 6.7 ఇంచుల హెచ్‌డీ + డిస్‌ప్లే
# క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌
#  ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
# 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌
# 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
# 36000 mAh బ్యాటరీ 

Trending News