Flipkart Republic Day Sales 2024: ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు

Flipkart Republic Day Sales 2024: రిపబ్లిక్ డే, సంక్రాంతి పురస్కరించుకుని ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగ ప్రారంభం కానుంది. రిపబ్లిక్ డే సేల్ కొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. జనవరి 14 నుంచి 19 వరకూ రిపబ్లిక్ డే సేల్ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 10, 2024, 03:53 PM IST
Flipkart Republic Day Sales 2024: ఐపోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ, వివో ఫోన్లపై భారీ ఆఫర్లు, తగ్గింపులు

Flipkart Republic Day Sales 2024: రిపబ్లిక్ డే సేల్ 2024 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ధరల తగ్గింపు భారీగా ఉండనున్నాయి. ఆరురోజుల రిపబ్లిక్ డే సేల్..ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఓ రోజు ముందే అందుబాటులో ఉంటుంది. 

ఫ్లిప్‌కార్డ్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా వివిధ రకాల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు క్రెడిట్ కార్డ్స్‌పై డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా యాపిల్, శాంసంగ్, గూగుల్, రియల్ మి ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. కొన్ని రకాల వస్తువులపై ఏకంగా 85 శాతం డిస్కౌంట్ ఉంది. ఈ సేల్‌లో ఆపిల్, శాంసంగ్, రియల్ మి, మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల ధరల్లో భారీ తగ్గింపు ఉంటుంది. ఐఫోన్ 14, గూగుల్ పిక్సెల్ 7ఎ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో, శాంసంగ్ ఎఫ్14 5జి, రియల్ మి సి53, రియల్ మి 11ఎక్స్ 5జి, మోటో జి54 వంటి ఫోన్లపై భారీగా డిస్కౌంట్ ఉంటుంది. 

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ వాస్తవానికి జనవరి 14 నుంచి జనవరి 19 వరకూ అందుబాటులో ఉన్నా..ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం ఇవాళ అంటే డిసెంబర్ 13 రాత్రి నుంచే అందుబాటులో ఉండనుంది. వివో ఎక్స్ 100 సిరీస్, ఒప్పో రెనో 11 సిరీస్, ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 8, రెడ్‌మి నోట్ 13 ప్రో, పోకో ఎక్స్ 6 సిరీస్ ఫోన్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఉంటుంది.

Also read: BCCI Awards: హైదరాబాద్ వేదికగా బీసీసీఐ అవార్డుల వేడుక, హాజరుకానున్న స్టార్ ఆటగాళ్లు

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News