High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!

Best Mileage SUVs in India 2023. మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ అత్యంత ఇంధన సామర్థ్య ఎస్‌యూవీలు. ఈ రెండు లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలవు.    

Written by - P Sampath Kumar | Last Updated : Feb 28, 2023, 06:40 PM IST
  • అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు
  • లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు
  • హైబ్రిడ్ వెర్షన్ 28 కిలోమీటర్ల వరకు మైలేజీ
High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!

Maruti Suzuki Grand Vitara and Toyota Hyryder Suv Cars Gives 28KM Mileage Per Liter: భారత కార్ మార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరు ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎస్‌యూవీలు కాస్త తక్కువ మైలేజీని ఇస్తాయి కాబట్టి.. వీటిని కొంటే ఖర్చు పెరుగుతుందా? అనే సందేహం చాలా మందికి ఉంది. అలాంటిది ఏమీ లేదు. మార్కెట్లో ప్రస్తుతం మంచి మైలేజీని ఇచ్చే పలు ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పాపులర్ ఎస్‌యూవీల గురించి తెలుసుకుందాం. వీటిలో రెండు ఎస్‌యూవీలు 28 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలవు.

అత్యంత మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే (Best Mileage SUVs):
Maruti Suzuki Grand Vitara (మైలేజ్- 27.97KMPL)
Toyota Urban Cruiser Hyryder (మైలేజ్- 27.97KMPL)
Kia Sonet (మైలేజ్- 24.2KMPL)
Hyundai Venue (మైలేజ్- 23.4KMPL)
Tata Nexon (మైలేజ్- 21.5KMPL)
Maruti Brezza (మైలేజ్- 20.15KMPL)

మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ దేశంలో అత్యంత ఇంధన సామర్థ్య ఎస్‌యూవీలు. ఈ రెండు మోడల్‌లు 1.5L NA పెట్రోల్ మరియు 1.5L అట్కిన్సన్ సైకిల్ పవర్‌ట్రెయిన్ ఎంపికను కలిగి ఉన్నాయి. ఫీచర్స్ నుంచి స్పెసిఫికేషన్ల వరకు దాదాపు ప్రతిదీ ఒకేలా ఉంటుంది. అయితే డిజైన్‌లో మాత్రమే తేడా ఉంది. టాప్ హైబ్రిడ్ వెర్షన్ (1.5L అట్కిన్సన్ సైకిల్ పవర్‌ట్రెయిన్) 27.97KMPL వరకు మైలేజీని ఇస్తుంది.

మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ కార్లలో డీజిల్ ఇంజన్ ఎంపిక లేదు. మిగిలిన కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ మరియు టాటా నెక్సాన్‌లలో డీజిల్ ఇంజన్లు కూడా ఉన్నాయి. మారుతి బ్రెజాలో డీజిల్ ఇంజన్ ఎంపిక లేదు. ఎస్‌యూవీలు కూడా మంచి మైలేజీని ఇస్తాయి కాబట్టి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 

Also Read: Best SUVs Under 10 Lakhs: పంచ్, నెక్సాన్, బ్రెజా మాత్రమే కాదు.. ఈ సూపర్ ఎస్‌యూవీలు కూడా 10 లక్ష్యలే!

Also Read: Airtel Recharge Price Hike: ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరగనున్న రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News