Hyundai Creta @ Rs 4 Lakhs: రూ. 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనాలు

Hyundai Creta SUV @ Rs 4 Lakhs: క్రెటా కారు స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. క్రెటాను లోన్‌పై కొనుగోలు చేయొచ్చు. 

Written by - P Sampath Kumar | Last Updated : Mar 17, 2023, 10:52 AM IST
  • కేవలం 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా
  • ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు
  • EMI చూడండి ఒకసారి
Hyundai Creta @ Rs 4 Lakhs: రూ. 4 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనాలు

Buy Hyundai Creta Just @ Rs 4 Lakhs: చాలా కాలంగా 'హ్యుందాయ్ క్రెటా' భారతీయ మార్కెట్‌ను శాసిస్తోంది. ఇది హ్యుందాయ్ కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీ. హ్యుందాయ్ క్రెటా ముందుగా 2014లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబడింది. రెండవ తరం మోడల్ 2020లో వచ్చింది. క్రెటా అమ్మకాలు ముందునుంచి బాగానే ఉన్నాయి. క్రెటా కారు స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు నమ్మకమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. క్రెటా మూడు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి.

Hyundai Creta Sales:
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు హ్యుందాయ్ క్రెటా. ఈ కారుని మీరు కేవలం రూ. 4 లక్షలకే ఇంటికి తీసుకెళిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. హ్యుందాయ్ క్రెటా ధర రూ. 10.84 లక్షల నుంచి రూ. 19.13 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది. ఆన్‌రోడ్ ధర అయితే మరింత పెరగనుంది. ఈ కారు మొత్తం ఏడు ట్రిమ్‌లలో (E, EX, S, S+, SX ఎగ్జిక్యూటివ్, SX మరియు SX(O))  విక్రయించబడుతుంది. క్రెటా 6 మోనోటోన్ మరియు 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది 5 సీట్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారు భారీ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. 

Hyundai Creta Price: 
హ్యుందాయ్ క్రెటా కారును మీరు లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 4 లక్షలు చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. క్రెటా యొక్క బేస్ వేరియంట్ (E పెట్రోల్) ధర రూ. 12.54 లక్షలు. మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు. అదే సమయంలో లోన్ కాలపరిమితి 1 నుండి 7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు. వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. 

Hyundai Creta EMI Calculator:
ఉదాహరణకు రూ. 4 లక్షల డౌన్ పేమెంట్, 10 శాతం వడ్డీ రేటు మరియు 5 సంవత్సరాల రుణ కాలవ్యవధిని మీరు ఎంచుకున్నారు అనుకుందాం. అప్పుడు మీరు ప్రతి నెలా రూ. 18,147 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు లోన్ మొత్తానికి (రూ. 8.54 లక్షలు) అదనంగా రూ. 2.34 లక్షలు చెలించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు రూ. 4 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటా కారును ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. 

Also Read: White Cobra Video: ఈ పాము మీ దగ్గరుంటే మిలియన్ల డాలర్లు మీ సొంతం, నమ్మట్లేదా?

Also Read: Mars Transit 2023: మిథున రాశిలో కుజ సంచారం.. ఈ 4 రాశుల వారు మే 10 వరకు జాగ్రత్తగా ఉండాలి! భారీ నష్టం తప్పదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News