Top Sold Cars: ఏప్రిల్ నెలలో దుమ్ము రేపిన టాటా పంచ్, టాప్ 10 జాబితాలో అన్నీ మారుతి కార్లే

Top Sold Cars: దేశీయంగా వివిధ కంపెనీ కార్లు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ఒక్కో నెల ఒక్కో కారు అగ్రస్థానంలో నిలుస్తోంది. మొన్నటి వరకూ టాప్ 10 అత్యధిక విక్రయాల్లో ఉన్న టాటా నెక్సాన్ ఇప్పుడా స్థానం కోల్పోయింది. అదే కంపెనీ నుంచి మరో కారు వచ్చి చేరింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2024, 04:48 PM IST
Top Sold Cars: ఏప్రిల్ నెలలో దుమ్ము రేపిన టాటా పంచ్, టాప్ 10 జాబితాలో అన్నీ మారుతి కార్లే

Top Sold Cars: గత కొద్దికాలంగా సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. దేశీయంగా రెండు రకాల ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నా.యి. ఒకటి సాధారణ ఎస్‌యూవీ కాగా రెండవది మిడ్ సైజ్ ఎస్‌యూవీ. ఇక ఇప్పుడు కొత్తగా కాంపాక్ట్ ఎస్‌యూవీ వస్తోంది. ప్రముఖ భారతీయ కార్ల కంపెనీ టాటాకు చెందిన టాటా పంచ్ టాప్ సేల్స్‌లో నిలుస్తోంది. 

ప్రతి నెలా దేశంలో ఏ కారు ఎన్ని యూనిట్ల అమ్మకాలు సాగించిందనే వివరాలు వెల్లడౌతుంటాయి. ఏప్రిల్ 2024 లో టాటా పంచ్ అత్యధికంగా విక్రయమైందని తెలుస్తోంది. అదే సమయంలో టాటా మోటార్స్‌కు చెందిన టాప్ సెల్లింగ్ కారుగా ఉన్న నెక్సాన్ టాప్ 19 జాబితాలో స్థానం కోల్పోయింది. ఏప్రిల్ నెల టాప్ 10 కార్ల విక్రయాలు పరిశీలిద్దాం

ఏప్రిల్ 2024లో టాటా పంచ్ మొత్తం 19,158 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. ఇది 2023 ఏప్రిల్ నెలతో పోలిస్తే అప్పటి 10,934 యూనిట్ల కంటే 75 శాతం ఎక్కువ. 

ఇక రెండవ స్థానంలో మారుతి వేగన్ ఆర్ మొత్తం 17.850 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇది 2023 ఏప్రిల్ నెలలోని 20,879 యూనిట్లతో పోలిస్తే 15 శాతం తక్కువే.

మూడవ స్థానంలో మారుతి బ్రెజా ఉంది. ఈ కారు ఏప్రిల్ 2024లో 17.113 యూనిట్ల విక్రయాలు జరిపింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే కారు 11,836 యూనిట్ల విక్రయాలు చేసింది. అప్పటితే పోలిస్తే ఈసారి 45 శాతం ఎక్కువ.

నాలుగో స్థానంలో మారుతి డిజైర్ కారు ఉంది. ఈ కారు ఏప్రిల్ 2024లో 1,825 యూనిట్ల విక్రయాలతో గత ఏడాది కంటే 56 శాతం ఎక్కువ నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఈ కారు 10,132 యూనిట్లు సేల్స్ జరిగాయి.

ఐదవ స్థానంలో హ్యుండయ్ క్రెటా ఉంది. ఈ కారు ఏప్రిల్ నెలలో మొత్తం 15,447 యూనిట్లు అమ్మకాలు సాగించింది. గత ఏడాది ఇదే కారు 14,186 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. అప్పటితో పోలిస్తే 9 శాతం ఎక్కువ.

మహీంద్రా స్కార్పియో ఎన్ , క్లాసిక్ కార్లు ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏప్రిల్ 2024లో మొత్తం 14,807 యూనిట్లు అమ్మకాలు చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే కారు 9,617 యూనిట్లు అమ్మింది. అంటే 54 శాతం ఎక్కువ.

7వ స్థానంలో మారుతి ఫ్రాంక్స్ ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొత్తం 14, 286 యూనిట్లు అమ్మకాలు జరగగా గత ఏడాది ఏప్రిల్ నెలలో 8,784 యూనిట్లు విక్రయాలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే 63శాతం ఎక్కువ.

ఇక 8వ స్థానంలో మారుతి బలేనే ఉంది. ఏప్రిల్ 2024 నెలలో మొత్తం 14,049 యూనిట్లు అమ్మకాలు చేస్తే గత ఏడాది మాత్రం 16,180 యూనిట్లు నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే 13 శాతం తక్కువ.

ఇక 9వ స్థానంలో మారుతి ఎర్టిగా ఉంది. ఏప్రిల్ 2024లో మొత్తం 13, 544 యూనిట్ల అమ్మకాలు సాగిస్తే గత ఏడాది మాత్రం కేవలం 5,532 యూనిట్లే విక్రయాలు జరిపింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏకంగా 145 శాతం ఎక్కువ.

మారుతి కంపెనీకు చెందిన మారుతి ఈకో పదో స్థానంలో ఉంది. ఏప్రిల్ నెలలో 12,060 యూనిట్లు అమ్మకాలు చేస్తే గత ఏజాది 10,504 యూనిట్లు నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ.

మొత్తం టాప్ 10 అత్యధిక విక్రయాలను పరిశీలిస్తే అత్యధికంగా మారుతి కంపెనీ కార్లు లిస్ట్ అయ్యాయి. టాప్ 10 స్థానాల్లో 2,3, 4,7,8,9, 10 స్థానాలు మారుతి కంపెనీవే కావడం విశేషం.

Also read: Maruti Suzuki Swift 2024: 25.75kmpl మైలేజీతో కొత్త మోడల్‌ Swift 2024 వచ్చేసింది.. ఫీచర్స్‌ చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News