LIC IPO Update: మే మొదటి వారంలోనే ఎల్​ఐసీ ఐపీఓ.. పూర్తి అప్​డేట్స్ ఇవే

LIC IPO Update: ఎల్​ఐసీ ఐపీఓపై మరో కొత్త అప్​డేట్​ వచ్చింది. మే తొలినాళ్లలో ఎల్​ఐసీ ఐపీఓను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. 5 శాతంకన్నా ఎక్కువ వాటాను ఐపీఓలో విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 06:03 PM IST
  • ఎల్​ఐసీ ఐపీఓపై కేంద్రం కీలక నిర్ణయం
  • వచ్చే నెల తొలివారంలోనే పూర్తి!
  • ఐపీఓలో విక్రయవాటా పెంపుపై అంచనాలు
LIC IPO Update: మే మొదటి వారంలోనే ఎల్​ఐసీ ఐపీఓ.. పూర్తి అప్​డేట్స్ ఇవే

LIC IPO Update: గత కొన్నాళ్లుగా మదుపరులు ఎక్కువగా చర్చించుకుంటున్న అంశం జీవిత బీమా సంస్థ (ఎల్​ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ). గత నెలాఖరున ఎల్​ఐసీ ఐపీఓ పూర్తి కావాల్సి ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అది వాయిదా పడింది. దీనితో.. మరోసారి ఐపీఓ కోసం సెక్యూరిటీస్​ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి దరఖాస్తు చేసుకుంది ఎల్​ఐసీ. దీనితో ప్రస్తుతం ఎల్​ఐసీ ఐపీఓపై కొత్త అంచనాలు వస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం.

వచ్చే నెల ఆరంభంలోనే ఐపీఓ..

వచ్చేనెల ఆరంభంలోనే ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రముఖ బిజినెస్​ వార్తా సంస్థ సీఎన్​బీసీ- టీవీ 18 ఓ కథనం రాసుకొచ్చింది. ఈ కథనం ప్రకారం.. 5 శాతం కన్నా ఎక్కువ వాటాను ఐపీఓ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఐపీఓలో విక్రయించే వాటాలో 10 శాతం వరకు పాలసీదారులకు, మరో 35 శాతం వరకు రిటైల్ ఇన్వెస్టర్లకోసం రిజర్వు చేయనున్నట్లు తెలిసింది. మొత్తం మీద ఐపీఓ ద్వారా 31 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుందట ఎల్​ఐసీ.

మరిన్ని..

ప్రస్తుతం ఎల్​ఐసీలో 100 శాతం వాటా (632.49 కోట్ల షేర్లు) ప్రభుత్వాధీనంలో ఉంది. అయితే 2021-22 బడ్జెట్​ ప్రతిపాదనల్లో ఆదాయపు అంచనాలను అందుకునేందుకు ఎల్​ఐసీని ఐపీఓకు తీసుకురావాలని నిర్ణయించింది. నిజానికి మార్చి 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వల్ల మార్కెట్లో నెలకొన్న అస్తిరతలను దృష్టిలో ఉంచుకుని.. ఐపీఓను వాయిదా వేసింది.

ఇక తాజాగా సెబికి సమర్పించిన డీబీఆర్​హెచ్ ప్రకారం.. మే 12 వరకు ఐపీఓ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశముందని తెలిసింది. అప్పటి వరకు కూడా ఐపీఓ పూర్తవకుంటే.. మరోసారి ఎల్​ఐసీ సెబికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందట. అయితే ఇప్పటి వరకు ఎల్​ఐసీ నుంచి గాని ప్రభుత్వం నుంచి గాని ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also read: Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా

Also read: Channels block: నకిలీ వార్తలు ప్రసారం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

pple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News