LPG Cylinder Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు

LPG Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్పాయి. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.7 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ గ్యాస్ ధర 1,780 రూపాయలకు చేరింది. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 4, 2023, 05:43 PM IST
LPG Cylinder Price: వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధరలు

LPG Gas Cylinder Price Today: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్‌కు 7 రూపాయల చొప్పున పెంచాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర సిలిండర్‌కు రూ.1,773 నుంచి 1,780 రూపాయలకు పెరిగింది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను విడుదల చేస్తాయి. కానీ ఈసారి జూలై 4వ తేదీన గ్యాస్ ధరలు పెంచడం గమనార్హం. జూన్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.83 తగ్గిన విషయం తెలిసిందే.

మార్చి నెల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతూ వచ్చాయి. మార్చిలో సిలిండర్ ధర 2119.50 రూపాయలు ఉండగా.. ఏప్రిల్‌లో రూ.2028కి తగ్గింది. మేలో రూ.1856.50 చేరుకోగా.. జూన్ 1న 1773 రూపాయలకు తగ్గింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత సిలిండర్ ధర రూ.7 పెరిగింది.  

 

మార్చి నెల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతూ వచ్చాయి. మార్చిలో సిలిండర్ ధర 2119.50 రూపాయలు ఉండగా.. ఏప్రిల్‌లో రూ.2028కి తగ్గింది. మేలో రూ.1856.50 చేరుకోగా.. జూన్ 1న 1773 రూపాయలకు తగ్గింది. ఇప్పుడు నాలుగు నెలల తర్వాత సిలిండర్ ధర రూ.7 పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడం గృహ వినియోగదారులకు ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో 1103 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో రూ.1129, ముంబైలో రూ.1102, చెన్నైలో రూ.1118 హైదరాబాద్‌లో రూ.1155, ఆంధ్రప్రదేశ్‌లో 1160 రూపాయలుగా ఉంది. 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహా అన్ని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరల ఆధారంగా గ్యాస్ ధరలను నిర్ణయిస్తుంటాయి. ప్రతి నెల ఇవి మారుతూ ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో కమర్షియల్ సిలిండర్ ధరలు వరుసగా తగ్గుముఖం పట్టగా.. ఈ నెలలో మళ్లీ పెరిగాయి.

Also Read: AP Pension Scheme: జగన్ సర్కారు శుభవార్త.. త్వరలో రెండో పెన్షన్‌..?   

Also Read: Pension Scheme For Unmarried: పెళ్లికాని వారికి గుడ్‌న్యూస్.. పెన్షన్ పథకం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

Trending News