Maruti Cars Discounts: మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా 60 వేల డిస్కౌంట్! ఈ అవకాశం మళ్లీ రాదు

Maruti Suzuki Cars Discounts in 2023 May.మే నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి ఆల్టో మరియు మారుతి సుజుకి డిజైర్‌లను  చౌకగా కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : May 20, 2023, 08:27 PM IST
Maruti Cars Discounts: మారుతి సుజుకీ బంపర్ ఆఫర్.. ఈ కారుపై ఏకంగా 60 వేల డిస్కౌంట్! ఈ అవకాశం మళ్లీ రాదు

Maruti Suzuki Cars Discounts in 2023 May: కార్ల తయారీదారులు కస్టమర్లను ఆకర్షించడానికి, స్టాక్‌ను క్లియర్ చేయడానికి నిత్యం తగ్గింపు ఆఫర్‌లను అందిస్తాయన్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ' మే నెలలో తన చౌక కార్లను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. దేశంలో ఇప్పటికే అత్యంత చౌకైన కారు అయిన 'మారుతి సుజుకి ఆల్టో'పై అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా మీరు ఈ నెలలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి ఆల్టో మరియు మారుతి సుజుకి డిజైర్‌లను కూడా చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. 

Maruti Suzuki Alto k10 Discount:
మీడియా నివేదికల ప్రకారం... మారుతి సుజుకీ మే నెలలో తన ఆల్టో కె10 కారుపై రూ. 59,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో వినియోగదారుల ఆఫర్ 40 వేలు కాగా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ 15 వేలు. ఇక ప్రత్యేక కార్పొరేట్ ఆఫర్ 4 వేలు ఉంది. అయితే కంపెనీకి చెందిన ఆల్టో కారుపై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తోంది. ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఆల్టో 800 స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉంటాయి. BS6 ఫేజ్ 2 నియమం కారణంగా మారుతి కంపెనీ తన ఆల్టో 800 కారును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మిగిలిన స్టాక్ మాత్రమే క్లియర్ చేయబడుతోంది.

ఇతర మోడళ్ల ఆఫర్స్:
మారుతి సుజుకి తన స్ప్రెస్సో కారుపై మే నెలలో 30 నుండి 35 వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది.
మారుతి సుజుకి తన వ్యాగన్ఆర్ కారుపై మే నెలలో 30 వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది.
మారుతి సుజుకి తన డిజైర్‌ కారుపై మే నెలలో 30 నుండి 35 వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది.

Also Read: DC vs CSK: ఢిల్లీపై ఘన విజయం.. ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన చెన్నై!

Also Read: Chaitanya Master Suicide : మల్లెమాల, ఢీ షోపై ట్రోల్స్.. చైతన్య మాస్టర్‌ను మరిచిపోయారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News