Multibagger Stocks: 14 వేల పెట్టుబడి..21 ఏళ్లలో కోటి రూపాయలు

Multibagger Stocks: షేర్ మార్కెట్‌లో ఎప్పుడు ఎలా ఉంటుందనేది అంచనా వేయడం కష్టం. అవగాహన ఉంటే మాత్రం షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించవచ్చు. ఇందుకు ఉదాహరణ మల్టీబ్యాగర్ స్టాక్స్..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 5, 2022, 03:50 PM IST
Multibagger Stocks: 14 వేల పెట్టుబడి..21 ఏళ్లలో కోటి రూపాయలు

Multibagger Stocks: మల్టీబ్యాగర్ స్టాక్స్. ఇటీవల షేర్ మార్కెట్‌కు సంబంధించి ఎక్కువగా విన్పిస్తున్న పేరు. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడితో అద్భుతమైన లాభాలుంటాయి. ఇందులో భాగంగా ప్రముఖ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ హవెల్స్ ఇండియా షేర్ల గురించి తెలుసుకుందాం..

షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు అధిక లాభాలు ఆర్జించి పెడుతుంటాయి. ముఖ్యంగా మల్టీబ్యాగర్ స్టాక్స్. మీరు కూడా ఇలాగే మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే..ప్రముఖ ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ హవెల్స్ ఇండియా షేర్ల గురించి తెలుసుకోండి. ఈ కంపెనీ షేర్లు ఇప్పుడు ఇన్వెస్టర్లను కోటీశ్వరుల్ని చేస్తోంది. 

21 ఏళ్ల క్రితం మీరు ఈ కంపెనీలో 14 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..అది ఇవాళ మిమ్మల్ని కోటీశ్వరులుగా చేస్తుంది. మార్కెట్ నిపుణుల ప్రకారం రానున్న రోజుల్లో ఈ కంపెనీ షేర్ విలువ మరింతగా పెరగనుంది. ఈ కంపెనీ షేర్ కేవలం నెలరోజుల వ్యవధిలోనే 7 శాతం పెరిగింది. ఈ షేర్ ప్రస్తుతం 1347 రూపాయలకు ట్రేడ్ అవుతోంది. 1450 రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. 

గత ఐదేళ్లలో ఈ షేర్‌ 3.14 శాతం పెరిగింది. ఈ సందర్భంగా స్టాక్ 41 రూపాయలు పెరిగి 1347.90 రూపాయలకు చేరుకుంది. గత 6 నెలల్లో షేర్ విలువలో 7.67 శాతం పెరిగింది. గత ఐదేళ్ల ఛార్ట్ పరిశీలిస్తే..అక్టోబర్ 6, 2017న కంపెనీ షేర్ 510.15 రూపాయలుంది. గత ఐదేళ్లలో ఈ షేర్ 164.22 శాతం రిటర్న్ ఇచ్చింది. అంటే 837.75 రూపాయలు పెరిగింది. 

ఈ కంపెనీ షేర్ విలువ పెరగడంతో ఇన్వెస్టర్లు 21 ఏళ్లలో కోటీశ్వరులైపోయారు. 2001 మార్చ్ 23న షేర్ విలువ కేవలం 1.89 రూపాయలుంది. ఈ కాలంలో షేర్ 71,217.46 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ షేర్ 1346.01 రూపాయలకు చేరుకుంది. 1.89 రూపాయలు షేర్ ఉన్నప్పుడు 14 వేల పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు 1 కోటి రూపాయలకు పెరిగింది. ఈ షేర్ మార్కెట్‌లో 52 వారాల అత్యధిక ధరకు 1504.45 రూపాయలకు చేరుకుంది. 

Also read: Today Gold Rate: దసరా రోజు భారీ షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన పసిడి ధరలు.. తులం ఎంత ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News