OnePlus 11R Phone features & Price: వన్‌ప్లస్ నుండి తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల సూపర్ స్మార్ట్‌ఫోన్

OnePlus 11R Phone features & Price: వన్‌ప్లస్ నిర్వహించిన క్లౌడ్ 11 ఈవెంట్‌లో OnePlus 11తో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సైతం మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ గ్రేడ్‌లోని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అనుభవించాలనుకునే వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అని అనుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 09:41 PM IST
OnePlus 11R Phone features & Price: వన్‌ప్లస్ నుండి తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల సూపర్ స్మార్ట్‌ఫోన్

OnePlus 11R Phone features & Price: వన్‌ప్లస్ కంపెనీ తక్కువ ధరకే మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ OnePlus 11R ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వన్‌ప్లస్ 10R కి కొనసాగింపు వెర్షన్. చైనాలో OnePlus Ace 2 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియాలో OnePlus 11R గా విడుదలైంది. వన్‌ప్లస్ నిర్వహించిన క్లౌడ్ 11 ఈవెంట్‌లో OnePlus 11తో సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సైతం మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ గ్రేడ్‌లోని స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అనుభవించాలనుకునే వారికి ఈ ఫోన్ సరైన ఎంపిక అని అనుకోవచ్చు. 

ఇండియాలో వన్‌ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ ధర
వన్‌ప్లస్ 11R 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 గా ఉండగా.. 16GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999 గా ఉంది. ఫిబ్రవరి 28 నుంచి OnePlus 11R అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ 11R ఫీచర్స్..
వన్‌ప్లస్ 11R 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను అమర్చారు. పంచ్ హోల్ కెమెరా డిజైన్‌తో రూపొందిన ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగాన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 

వన్‌ప్లస్ 11R కెమెరా ఎలా ఉందంటే..
ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటోంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX890 కెమెరా కాగా.. 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. అందమైన సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది.

వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ బ్యాటరీ సెటప్
వన్‌ప్లస్ 11R లో 5000mAh శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ కలిగి ఉంది. 25 నిమిషాల్లో ఈ ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అవుతుందని వన్‌ప్లస్ కంపెనీ స్పష్టంచేసింది.

ఇది కూడా చదవండి : Rs 39,000 Smartphone for Rs 8000: రూ. 39 వేల స్మార్ట్ ఫోన్ జస్ట్ రూ. 8 వేలకే.. బంపర్ ఆఫర్

ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News