Samsung Galaxy F22 Offer: రూ.15,000 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఫోన్..కేవలం రూ. 749కే.. ఆఫర్ మరో 24 గంటలే

Samsung Galaxy F22: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. రేపటితో ముగియనున్న ఈ సేల్‌లో 15 వేల రూపాయల శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఫోన్..కేవలం 749 రూపాయలకే పొందవచ్చు..ఎలాగంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 9, 2022, 07:40 PM IST
Samsung Galaxy F22 Offer: రూ.15,000 శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఫోన్..కేవలం రూ. 749కే.. ఆఫర్ మరో 24 గంటలే

Samsung Galaxy F22 Price, Offer and Sepecifications: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ నడుస్తోంది. రేపటితో ముగియనున్న ఈ సేల్‌లో 15 వేల రూపాయల శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఫోన్..కేవలం 749 రూపాయలకే పొందవచ్చు..ఎలాగంటే..

అటు అమెజాన్..ఇటు ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డిస్కౌంట్లతో ఆఫర్ సీజన్ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ రేపటి వరకూ అంటే ఆగస్టు 10 వరకూ ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

ఇందులో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 స్మార్ట్‌ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్ నడుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 14 వేల 999 రూపాయలు కాగా..30 శాతం డిస్కౌంట్ అనంతరం 10 వేల 499 రూపాయలకు లభించనుంది. ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే..వేయి రూపాయల వరకూ తగ్గింపు ఉంటుంది. అయితే ఈ తగ్గింపు 5 వేలకంటే ఎక్కువ కొనుగోలుపైనే వర్తిస్తుంది. ఇక పాత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ మోడల్, కండీషన్‌ను బట్టి..9 వేల 750 రూపాయల వరకూ తగ్గుతుంది. అంటే ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే..15 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 749 రూపాయలకే లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 22 ఫీచర్లు

ఈ స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో 6 జీబీ ర్యామ్ కూడా అందుబాటులో ఉంది. 6.4 ఇంచెస్ హెచ్‌డి డిస్‌‌ప్లేతో త్రిపుల్ కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. 48 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్‌తో పాటు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా కూడా ఉంది. మరోవైపు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. డెనిమ్ బ్లూ కలర్‌లో లభ్యమౌతుంది. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా ఈ ఆఫర్ ఉంది. రేపటి వరకూ అంటే మరో 24 గంటలు మాత్రమే ఆఫర్ మిగిలుంది. వెంటనే త్వరపడితే ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Also read: Railway Ticket New Rules: రైల్వే కన్ఫామ్ తత్కాల్ టికెట్ కోసం ఈ టిప్స్ పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News