Share Market: మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు అత్యధిక డివిడెండ్ అందించిన 8 కంపెనీలు

Share Market: షేర్ మార్కెట్‌లో చాలా రకాల షేర్లు అందుబాటులో ఉంటాయి. కొన్ని లాభాల్ని ఆర్జిస్తుంటే కొన్ని అదే పనిగా నష్టాలు అందిస్తుంటాయి. అందుకే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేముందు పరిశీలన చాలా అవసరం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 6, 2023, 12:15 AM IST
Share Market: మార్కెట్‌లో ఇన్వెస్టర్లకు అత్యధిక డివిడెండ్ అందించిన 8 కంపెనీలు

ఇన్వెస్టర్లకు కొన్ని స్టాక్స్ అమితమైన లాభాల్ని ఆర్జించి పెడుతుంటాయి. ఇందులో 8 ప్రభుత్వ రంగ సంస్థలు ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాల్ని ఇచ్చాయి. ఆ 8 కంపెనీల వివరాలు, ఇన్వెస్టర్లకు కలిగిన లాభమెంతనేది తెలుసుకుందాం..

ఎన్ఎండీసీ లిమిటెడ్

ఎన్ఎండీసీ స్టాక్ డివిడెంట్ లాభం 12.3 శాతముంది. జాబితాలో ఇదే అత్యధికం. తాగాగా ఈ కంపెనీ 46.06 శాతం డివిడెండ్ అందించింది. ఎన్ఎండీసీ స్టాక్ ధర డిసెంబర్ 7, 2022 నాటికి 119.95  రూపాయలుంది. పన్నుల అనంతరం కంపెనీ లాభం 30.07 శాతముంది. ఒక్కొక్క షేర్‌కు 21.43 రూపాయల లాభమొచ్చింది. 

గెయిల్ ఇండియా లిమిటెడ్

గెయిల్ డివిడెండ్ లాభం 10.07 శాతముంది. జాబితాలో మూడవ స్థానంగా చెప్పవచ్చు. చెల్లించిన డివిడెండ్ శాతం 36.23 గా ఉంది. ఈపీఎస్ విలువ 17.95 రూపాయలుంది. గెయిల్ షేర్ విలువ 93.25 రూపాయలుంది. 

రూరల్ ఎలక్ట్రిఫైయింగ్ కార్పొరేషన్ లిమిటెడ్

డివిడెంట్ లాభాల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న ఈ కంపెనీ 12 శాతం డివిండెండ్ అందించింది. చెల్లించిన డివిడెండ్ 30.11 శాతంగా ఉంది. ఇందులో పాట్ మార్జిన్ 26.23 శాతం కాగా, ఈపీఎస్ 38.97 శాతం వద్ద నిలిచింది. కంపెనీ షేర్ విలువ డిసెంబర్ 7, 2022 నాటికి 113.05 రూపాయలుంది.

కోల్ ఇండియా లిమిటెడ్

కోల్ ఇండియా ఈ సంవత్సరం ఇన్వెస్టర్లకు 230 శాతం డివిడెంట్ చెల్లించింది. ఈ డివిడెండ్‌ను మూడు భాగాల్లో అంటే ఫిబ్రవరి 21న 50 శాతం, ఆగస్టు 11న 30 శాతం, నవంబర్ 15న 150 శాతం చొప్పున చెల్లించింది. 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్

పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇన్వెస్టర్లకు 125 శాతం డివిడెండ్ చెల్లించింది. నాలుగు భాగాలుగా అంటే ఫిబ్రవరి 25న 60 శాతం, జూన్ 9న 12.5 శాతం, సెప్టెంబర్ 1న 22.5 శాతం, నవంబర్ 24న 30 శాతం చొప్పున చెల్లించింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్

ఇండియల్ ఆయిల్ కార్పొరేషన్ ఐవోసీఎల్ ఇవ్వెస్టర్లకు 64 శాతం డివిడెండ్ చెల్లించింది. రెండు భాగాల్లో అంటే ఫిబ్రవరి 9న 40 శాతం, ఆగస్టు 11 న 24 శాతం చెల్లించింది. 

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్‌పీసీఎల్ ఇన్వెస్టర్లకు ఈ ఏడాది 140 శాతం డివిడెండ్ చెల్లించింది. ఈ డివిడెండ్‌ను ఒకేసారి అంటే ఆగస్టు 22న 140 శాతం చెల్లించింది. 

ఎన్‌టి‌పిసి లిమిటెడ్

ఎన్‌టిపిసి లిమిటెడ్ ఇన్వెస్టర్లకు 70 శాతం డివిడెండ్ అందించింది. ఈ డివిడెండ్‌ను కంపెనీ రెండు భాగాల్లో ఫిబ్రవరి 3న 40 శాతం, ఆగస్టు 10న 30 శాతం చెల్లించింది. 

మరోవైపు 160 ఏళ్ల పురాతన కంపెనీ ఇంగర్‌సోల్ ర్యాండ్ ఇండియా లిమిటెడ్ షేర్ హోల్డర్లకు అత్యధికంగా 300 శాతం డివిడెండ్ అంటే ప్రతి షేర్‌కు 30 రూపాయలు చెల్లించింది. ఒక్కొక్క షేర్ ధర 10 రూపాయలు. కంపెనీ మధ్యంతతర డివిడెండ్ 7 రూపాయలు, ప్రత్యేక డివిడెండ్ 30 రూపాయల చొప్పున అందించింది. కేవలం 11 నెలల్లో ఇన్వెస్టర్లకు 72 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీ షేర్ ధర ఎన్ఎస్ఈలో జనవరి 3, 2022 నాటికి 1240.65 రూపాయలుండగా, అదే ఏడాది డిసెంబర్ 2 నాటికి 2141 రూపాయలైంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపుగా 6,782 కోట్లుంది. 

ఇంగర్‌సోల్ ర్యాండ్ కంపెనీ కంప్రెషర్ సిస్టమ్స్, పవర్ టూల్స్, లిఫ్టింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్స్ వంటి వస్తు సేవలు అందిస్తుంటుంది. చాలా రంగాలకు సర్వీసెస్ , సొల్యూషన్స్ అందిస్తోంది.

Also read: Multibagger Stock: మల్టీబ్యాగర్ స్టాక్‌గా పెన్నీ స్టాక్, ఏడాదిలో 20 లక్షలైన 1 లక్ష రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News