షేర్ మార్కెట్‌లో కొన్ని స్టాక్స్ ఎలా లాభాల్ని కురిపిస్తాయో..మరికొన్ని అలానే నష్టాలకు తెచ్చిపెడతాయి. భారీగా పతనమైన ఆ కంపెనీ షేర్ ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. భారీగా పతనమైన ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
షేర్ మార్కెట్‌లో భారీగా పతనమైన షేర్ డిబాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందింది. ఊహించని వేగంతో పతనమై..ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని తెచ్చిపెట్టింది. డీబాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 89,24 కోట్ల రూపాయలు. స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఫైలింగ్ సందర్భంగా కంపెనీ ఓ విషయం స్పష్టం చేసింది. సెబీ నియమాల ప్రకారం అక్టోబర్ 27, 2022న రికార్డ్ డేట్ నిర్ధారించిందని..దీనిప్రకారం 1:1 నిష్పత్తిలో 3,82,20 వేల ఈక్విటీ షేర్లకు బోనస్ షేర్ ఇస్తామని కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించినట్టు తెలిపింది.
ఏడాదిలో 92 శాతం మేర నష్టం
డిబాక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ గత ఏడాదిలో దాదాపు 92 శాతం నష్టాన్ని చవిచూసింది. బుధవారం నాడు ఈ కంపెనీ షేర్ పడిపోయి..11.70 రూపాయల వద్ద క్లోజ్ అయింది. సరిగ్గా ఏడాది క్రితం ఈ కంపెనీ షేర్ విలువ 147 రూపాయలుంది. 52 వారాల అత్యంత కనిష్ట ధర 12.25 రూపాయలుంది. గరిష్ట ధర 156.95 రూపాయలుంది.
147 రూపాయల్నించి 11.70 రూపాయలకు పడిపోయిన షేర్
ఏడాది క్రితం ఈ కంపెనీలో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..ఇప్పుడది 8 వేలకు పడిపోయింంది. అయితే గత 5 రోజుల్లో షేర్ విలువ 11.57 శాతం చొప్పున పెరుగుతోంది. 6 నెలల గురించి మాట్లాడుకుంటే..ఇందులో 90 శాతం తగ్గుదల ఉంది. ఈ ఏడాది ఈ షేర్ 147 రూపాయల్నించి తగ్గి 11.70 రూపాయలకు చేరుకుంది.
1 లక్ష రూపాయలు 8వేలకు పడిపోయిన వైనం
ఏడాది క్రితం ఈ కంపెనీలో షేర్ ధర 147 రూపాయలున్నప్పుడు పెట్టుబడి పెట్టుంటే..లక్ష రూపాయలకు 680 షేర్లు వచ్చేవి. కానీ ఇప్పుడు కంపెనీ షేర్ 11.70 రూపాయలకు చేరుకోవడంతో..లక్ష రూపాయలు కాస్తా 8 వేలకు పడిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook