TIME's 2021: టైమ్స్‘'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'’గా ఎలాన్‌ మస్క్‌

TIME's 2021: 2021 ఏడాదికి గానూ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎలాన్‌ మస్క్‌ను 'ది టైమ్‌' మ్యాగజైన్  ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2021, 09:42 PM IST
TIME's 2021: టైమ్స్‘'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌'’గా ఎలాన్‌ మస్క్‌

Time's 2021 Person of the Year is Elon Musk:  ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న  ఎలాన్‌ మస్క్‌(Elon Musk)ను 'ది టైమ్‌'(Time) మ్యాగజైన్‌ ఈ ఏడాదికి గానూ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’(Person of the Year )గా ప్రకటించింది. ''ప్రపంచంలో అత్యంత ధనవంతుడు..అయినా సొంత ఇల్లు లేదు. ఈ మధ్యే తన కంపెనీని అమ్మడం మొదలుపెట్టారు'' అంటూ ఎలాన్‌ మస్క్‌ గురించి టైమ్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. 

''‘అతడు ఓవైపు అంతరిక్ష కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెడతాడు.. మరోవైపు సూర్యకాంతిని సద్వినియోగం చేసుకుంటాడు. డ్రైవర్‌ అవసరం లేని కారును సృష్టించాడు. ఆయన ఒక్క వేలిని కదిలిస్తే స్టాక్‌ మార్కెట్‌ పరుగెడుతుంది లేదా మూర్ఛపోతుంది. అతని నోటి వచ్చే ప్రతి మాట ఎంతో మందిని ప్రభావితం చేస్తోంది. భూమిపై ఉన్నా అంగారకుడి గురించే కలలు కంటాడు. ఎలాంటి విషయాలనైనా ట్విటర్‌లో బహిరంగంగా చెప్పేందుకు ఎలాన్‌ మస్క్‌ వెనుకాడడు’ అంటూ ఎలాన్ మస్క్ వ్యక్తిత్వాన్ని  టైమ్స్‌ మ్యాగజైన్‌(Time Magazine) అభివర్ణించింది.

Also Read: Amazon mobile sale: అమెజాన్ భారీ ఆఫర్​- రూ.48 వేల స్మార్ట్​ఫోన్ రూ.27 వేలకే!

స్పేస్‌ఎక్స్‌ ద్వారా అంతరిక్షయానంలో దూసుకెళ్తున్నాడు మస్క్. ట్రిలియన్‌ విలువగల ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా... సోలార్‌, రోబోటిక్స్‌, క్రిప్టోకరెన్సీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి ఎన్నో రంగాల్లో తన సత్తా చాటుతున్నాడు.  250 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన సంపద కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తున్నారని టైమ్‌ మ్యాగజైన్‌ వ్యాఖ్యానించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News