Gold Price Today: మహిళలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే!

May 17th 2022 Gold and Silver Prices In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 07:35 AM IST
  • మహిళలకు శుభవార్త
  • నేటి బంగారం-వెండి రేట్లు ఇవే
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఎంతంటే
Gold Price Today: మహిళలకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Today Gold and Silver Rates: Gold Price stable today 17th May 2022: దేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో గోల్డ్ నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు.. ఇలా ఎన్నో కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అయితే బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో.. ధరలు ఎంత పెరిగినా వ్యాపారాలు జోరుగానే కొనసాగుతూ ఉంటాయి. ఇక దేశంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

దేశంలో రెండు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం (మే 17) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.46,250లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై.. 24 క్యారెట్ల ధరపై కూడా ఎలాంటి మార్పులు లేవు. మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 59,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 46,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,440గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 51,740 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,250.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 46,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,450గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ. 46,250.. 24 క్యారెట్ల ధర రూ. 50,450గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.50,450 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,500లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.64,500లుగా కొనసాగుతోంది. 

Also Read: Horoscope Today May 17 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు!

Also Read: Woman Becomes Man: అమ్మ' ప్రేమంటే ఇదే మరి.. కూతురి కోసం 30 ఏళ్ల పాటు 'పురుషుని'గా మారింది! కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News