Hyundai Electric Car 2023: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ క్రెటా.. సింగల్ ఛార్జ్‌పై 452 కిలోమీటర్లు!

Upcoming Cars, Hyundai testing Creta Electric Car in India.  ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 20, 2023, 11:54 PM IST
  • హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ క్రెటా
  • సింగల్ ఛార్జ్‌పై 452 కిలోమీటర్లు
  • ధర రూ. 15 నుంచి 18 లక్షల వరకు
Hyundai Electric Car 2023: హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ క్రెటా.. సింగల్ ఛార్జ్‌పై 452 కిలోమీటర్లు!

Hyundai to Launch Creta Electric Car in India: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'టాటా మోటార్స్' ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో నంబర్ వన్‌గా ఉంది. అయితే త్వరలోనే టాటా మోటార్స్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ తన ప్రసిద్ధ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది. కంపెనీ ఇప్పటికే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV) ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోపై రూ. 4000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. 6 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని యోచిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Upcoming Hyundai Creta Electric Car) గురించి పెద్దగా సమాచారం లేదు. అయితే కంపెనీ తన హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వంటి 39.2kWh ఎలక్ట్రిక్ బ్యాటరీని కలిగి ఉంటుంది నిపుణులు పేర్కొన్నారు. ఇది సింగల్ ఛార్జ్‌పై 452 కిలోమీటర్ల ప్రయాణం చేయొచ్చు. ఈ బ్యాటరీ అధిక డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క టెస్ట్ మోడల్ ప్రస్తుత ICE ఇంజిన్ క్రెటాను పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుత మోడల్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది. 

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క టెస్టింగ్ ప్రారంభ దశలో ఉంది. ఇది 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుందని సమాచారం తెలుస్తోంది. అయితే దీని ఉత్పత్తి 2024 చివరి నాటికి ప్రారంభమవుతుంది. ఈ కారు రాబోయే మారుతి సుజుకి YY8 EV, మహీంద్రా మరియు టాటా నుంచి వచ్చిన మిడ్-రేంజ్ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 15 నుంచి 18 లక్షల వరకు ఉండవచ్చు. ప్రస్తుతం హ్యుందాయ్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌లోని ఐయోనిక్ 5 ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 44.95 లక్షలు. అలానే  కోనా రూ. 23.84 లక్షలు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ. దీని ధరలు రూ. 14.49 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

Also Read: Bikes under 40000: రూ. 40 వేలకే బెస్ట్ బైక్‌లు.. సూపర్ లుకింగ్! కొనడానికి ఇదే మంచి అవకాశం   

Also Read: Shani Uday 2023: ఈ రాశుల వారికి మార్చిలో అద్భుతాలే.. ప్రతి సమస్య చిటికెలో మాయం! భారీగా బంగారం, వెండి వర్షం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News