Credit Card Upi payments: ఇక నుంచి క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు ప్రారంభం

Credit Card Upi payments: క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఆ కొత్త ఫీచర్ గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2022, 07:24 PM IST
Credit Card Upi payments: ఇక నుంచి క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు ప్రారంభం

దేశంలో యూపీఐ సేవలు రోజురోజుకూ విస్తృతమౌతున్నాయి. టెక్నాలజీ పెరిగేకొద్దీ..లావాదేవీలు సులభతరమౌతున్నాయి. అదే సమయంలో క్రెడిట్ కార్డు వినియోగం కూడా పెరుగుతోంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపులు కూడా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించే పరిస్థితి వచ్చింది.

క్రెడిట్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్. ఇక నుంచి యూపీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెల్లింపులు కూడా క్రెడిట్ కార్డు ద్వారా చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతానికి కస్టమర్లు వారి వారి బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేందుకు వీలుండగా, త్వరలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే పరిస్థితి వస్తుంది. రేజర్ పే చెల్లింపుల గేట్ వే ఉపయోగించే అనుమతి కేవలం వ్యాపారులకు మాత్రమే అందుబాటులో ఉంది.  ఇవాళ్టి నుంచి యూపీఐలో క్రెడిట్ కార్డు లావాదేవీలు ప్రారంభమయ్యాయి. త్వరలో రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐతో లింక్ చేసేందుకు అనుమతించే ఎన్‌సీపీఐ ఫీచర్ కోసం ఇది పనిచేస్తుంది.

యూపీఐలో రూపే క్రెడిట్ కార్డు ప్రారంభమైనందున..రేజర్ పే వ్యాపారులకు క్రెడిట్ కార్డు అనుమతి లభిస్తుంది. తొలిదశలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కస్టమర్లు ఈ ప్రయోజనం పొందుతారు. 

దేశంలో యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో దాదాపు 50 మిలియన్ల మంది వినియోగదారులకు క్రెడిట్ కార్డులున్నాయని ఓ అంచనా. గత మూడేళ్లలో క్రెడిట్ కార్డు వినియోగం 30 శాతం పెరిగింది. యూపీఐ ద్వారా 2022 అక్టోబర్ నెలలో 731 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. క్రెడిట్ కార్డు సేవల్ని మరింతగా పెంచేందుకు ఇక నుంచి యూపీఐతో అనుసంధానం చేయనున్నారు. 

Also read:  Post Office: వివాహితులకు శుభవార్త.. ఇలా చేస్తే ఏడాదికి రూ.59,400 ఆదాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News