Whatsapp Emoji Reaction: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇప్పుడు టైప్ చేయకుండానే మెసేజ్ కు రిప్లే ఇవ్వొచ్చు!

Whatsapp Emoji Reaction: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. వాట్సాప్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ను గురువారం (మే 5) నుంచి వాడుకలోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ప్రతి మెసేజ్ కు ఎమోజీ రిప్లే ఇవ్వొచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 01:02 PM IST
Whatsapp Emoji Reaction: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇప్పుడు టైప్ చేయకుండానే మెసేజ్ కు రిప్లే ఇవ్వొచ్చు!

Whatsapp Emoji Reaction: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. సుదీర్ఘ కాలం తర్వాత.. వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కోసమే వినియోగదారులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫీచర్ టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. కాబట్టి అదే ఫీచర్ ను ఇప్పుడు వాట్సాప్ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఈ కొత్త ఫీచర్ ఏమిటి?

మేము ఈ కొత్త ఫీచర్ ఏంటంటే.. దాని పేరు రియాక్షన్ ఫీచర్. దీని ద్వారా వినియోగదారులు ఏ మెసేజ్ కైనా ఎమోజీ ద్వారా స్పందించవచ్చు. దీని వల్ల మెసేజ్ చేసే సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం 6 ఎమోజీలతో మెసేజ్ కు రిప్లే ఇవ్వొచ్చు. 

ఏ ఎమోజీ ఎంపిక?

వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన 6 ఎమోజీలలో.. లవ్, లైక్, లాఫ్టర్, థాంక్స్, సర్‌ప్రైజ్, సాడ్ ఎమోజీలు ఉన్నాయి. ఇదే ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సప్ ఎంతో కాలంగా పరిశీలిస్తూ వచ్చింది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యూజర్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫీచర్ ను భవిష్యత్తులో మరింత వృద్ధి చేసే అవకాశం ఉంది. త్వరలోనే 2 GB వరకు సైజ్ ఉన్న ఫైల్స్ ను సెండ్ చేసే సదుపాయం అందుబాటులోకి రానుంది.  

Also Read: Realme Narzo 50 Offer: రూ.16 వేల విలువైన Realme మొబైల్ ను రూ.669 ధరకే కొనండి!

Also Read: Airtel OTT Plans: భారతీ ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News