Xiaomi 12 Pro Price: షావోమి 12 ప్రో ధరపై భారీ తగ్గింపు

Xiaomi 12 Pro Price Sale Discount Offers: షావోమి 12 ప్రో ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయిన సంగతి తెలిసిందే.  లాంచ్ అయిన తరువాత తొలిసారిగా ఫిబ్రవరిలో ఒకసారి ఈ ఫోన్ ధర రూ. 8 వేల మేర తగ్గింది. షావోమి 12 Pro ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. రెండింటి ధర రూ. 10,000 తగ్గింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 07:00 PM IST
Xiaomi 12 Pro Price: షావోమి 12 ప్రో ధరపై భారీ తగ్గింపు

Xiaomi 12 Pro Price Sale Discount Offers: షావోమి 12 ప్రో ఫోన్ ఈ ఏడాది ఆరంభంలో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయిన సంగతి తెలిసిందే.  లాంచ్ అయిన తరువాత తొలిసారిగా ఫిబ్రవరిలో ఒకసారి ఈ ఫోన్ ధర రూ. 8 వేల మేర తగ్గింది. షావోమి 12 Pro ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. రెండింటి ధర రూ. 10,000 తగ్గింది. 

అందులో ఒకటి 8GB + 256GB వేరియంట్ కాగా.. రెండోది 12GB + 256GB వేరియంట్. రెండింటిలోనూ ఇంటర్నల్ స్టోరేజ్ మెమొరీ ఒక్కటే సైజ్ కాగా.. ర్యామ్ మాత్రం ఒకదానిలో 8GB కాగా మరొక వేరియంట్ లో 12GB కానుంది. 8GB వేరియంట్‌ ధర రూ. 62,999 కాగా 12GB వేరియంట్ ధర రూ. 66,999 గా ఉంది. ఫిబ్రవరిలో రూ. 8వేలు తగ్గించిన తర్వాత, 8GB వెర్షన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 54,999 కి పడిపోగా.. 12GB వేరియంట్ ధర రూ. 58,999 కి తగ్గింది. 

తాజాగా ఇదే షావోమి 12 ప్రో ఫోన్‌పై షావోమి రూ. 10,000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ 10 వేల రూపాయల తగ్గింపు రెండు వేరియంట్స్‌కి వర్తించనుంది. తాజా తగ్గింపు అనంతరం 8GB వేరియంట్ ధర రూ. 44,999 కాగా 12GB వేరియంట్‌ ధర రూ. 48,999 కి చేరువైంది. నోయిర్ బ్లాక్, ఒపెరా మౌవ్, కోచర్ బ్లూ అనే మూడు రంగుల్లో షావోమి 12 ప్రో ఫోన్ లభిస్తోంది.

షావోమి 12 ప్రో ఫోన్ ఫీచర్స్ :
6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉన్న షావోమి 12 ప్రో 5G స్మార్ట్‌ఫోన్.. గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌కి సూపర్ ఫోన్ అనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీ, డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టం సపోర్ట్‌, హర్మాన్ కార్డాన్ క్వాడ్ స్పీకర్ సెటప్‌ వంటి ఈ ఫోన్ కి ఉన్న ప్రత్యేకమైన ఫీచర్స్. 

కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. షావోమి 12 ప్రో 50MP సోనీ IMX707 వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంది. 50MP టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్‌ని అమర్చారు. బ్యూటీఫుల్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఏర్పాటు చేశారు.

4600mAh బ్యాటరీతోకి సపోర్ట్ చేస్తూ 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌ టెక్నాలజీ ఈ ఫోన్ సొంతం. బూస్ట్ మోడ్‌లో ఫోన్ బ్యాటరీ కేవలం 18 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని షావోమి ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాండర్డ్ మోడ్‌లో చార్జింగ్ సమయం 24 నిమిషాల వరకు తీసుకుంటుంది. అదండీ సంగతి.. అద్భుతమైన ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ పై అంతే అద్భుతమైన ఆఫర్ అందిస్తూ లాంచ్ అయిన ఈ కొద్ది రోజుల్లోనే రెండు విడతల్లో కలిపి షావోమి కంపెనీ మొత్తం రూ. 18 వేలు తగ్గించింది. 

Trending News