Xiaomi 12 series: మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధరలు మాత్రం..!!

షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అయిన షియోమి 12, షియోమి 12 ఎక్స్‌, షియోమి 12 ప్రొ నేడు (డిసెంబర్ 28) చైనాలో లాంచ్ కానున్నాయి. అయితే రిలీజ్ కాకముందే షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెషిఫికేషన్లు నెట్టింట వైరల్ అయ్యాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 04:36 PM IST
  • మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్
  • షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్‌ అదుర్స్
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్స్‌
 Xiaomi 12 series: మార్కెట్‌లోకి షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు.. ధరలు మాత్రం..!!

Xiaomi 12, Xiaomi 12X and Xiaomi 12 Pro's Price, Features details goes viral in internet: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్​ఫోన్ (Smart Phone)​ మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిఒక్కరు స్మార్ట్​ఫోన్ వినియోగిస్తుండడంతో విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దీన్ని క్యాష్​ చేసుకునేందుకు అన్ని మొబైల్​ తయారీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్​ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త ఏడాది రాబోతున్న నేపథ్యంలో ప్రముఖ చైనా (China) కంపెనీ షియోమి (Xiaomi) కొత్త స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. షియోమి నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ సిరీస్ మార్కెట్‌లోకి లాంచ్‌ కానుంది. అయితే రిలీజ్ కాకముందే షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెషిఫికేషన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

షియోమి 12 సిరీస్ (Xiaomi 12 series) స్మార్ట్‌ఫోన్‌లు అయిన షియోమి 12 (Xiaomi 12), షియోమి 12 ఎక్స్‌ (Xiaomi 12X), షియోమి 12 ప్రొ (Xiaomi 12 Pro) నేడు (డిసెంబర్ 28) చైనాలో లాంచ్ కానున్నాయి. వీటితో పాటు షియోమి ట్రూ వైరెలెస్‌ ఇయర్‌ఫోన్స్‌ (టీడబ్ల్యూఎస్‌) 3 కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే రిలీజ్ కాకముందే షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధర, స్పెషిఫికేషన్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇషాన్ అగర్వాల్ అనే ట్విట్టర్ యూసర్ షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలను ట్విటర్‌లో పంచుకున్నారు. ఆ వివరాల ప్రకారం 11 సిరీస్ కంటే 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. 

Also Read: Ashes 2021: 68 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. సందుచూసి మైఖేల్ వాన్‌ను ఏసుకున్న వసీమ్ జాఫర్!!

8 జీబీ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ షియోమి 12 చైనాలో 4,299 యువాన్లు (భారత కరెన్సీలో రూ. 50,500)గా ఉంది. 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  4,599 యువాన్లు (దాదాపు రూ. 54,000).. 1 2జీబీ + 256 జీబీ వేరియంట్ ధర 4,999 (దాదాపు రూ. 58,800)గా ఉంది. షియోమి 12 ఎక్స్‌ 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,499 యువాన్లు (దాదాపు రూ. 41,100).. 8 జీబీ + 256 స్టోరేజ్ వేరియంట్ ధర 3,799 యువాన్లు (దాదాపు రూ. 44,700)గా ఉంది. షియోమి 12 ప్రో 8 జీబీ + 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ 4,999 యువాన్లుగా (సుమారు రూ. 58,800)గా ఉంది. 8 జీబీ + 256 స్టోరేజ్ వేరియంట్ ధర 5,299 యువాన్లు (దాదాపు రూ. 62,300)గా.. 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 5,699 యువాన్లు (దాదాపు రూ. 67,000)గా ఉంది. ఇక షియోమి ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 3 ధర 499 యువాన్లుగా (సుమారు రూ. 5,900)గా ఉంది. 

షియోమి 12 ఫీచర్స్‌ ఇవే:
# ఫుల్-హెచ్ డి+(1,920ఎక్స్1,080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ ప్లే
# డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ లైట్
# క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జనరల్ 1 ప్రాసెసర్
# 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
# స్క్రీన్ ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
# డ్యూయల్ సిమ్
# 5జీ సపోర్టబుల్ 
# 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ

Also Read: Samantha: గోవాలో బెస్ట్‌ ఫ్రెండ్‌తో సమంత ఎంజాయ్.. సామ్ బికినీ అందాలు మాములుగా లేవుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News