Mother Killed her Daughter: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురుని చంపేసిన తల్లి

కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి.. కన్న కూతురిని చంపేసిన ఘటన వరంగల్ జిల్లా జనగామలో చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి తన సొంత కూతురే అడ్డుగా ఉందని కూతురుని హాతమార్చిన ఘటన సంచలనంగా మారింది. ఆ వివరాలు 

Last Updated : Jul 12, 2023, 07:35 PM IST
Mother Killed her Daughter: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతురుని చంపేసిన తల్లి

ఈ మధ్య కాలంలో జరుగుతున్న చాలా నేరాలకు కారణం అక్రమ సంబంధాలని ఒక నివేదిక ద్వారా వెళ్లడి అయ్యింది. మరోసారి నాలుగున్నరేళ్ల  చిన్నారి హత్య కేసు విషయంలో పోలీసులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. ఆ చిన్నారిని స్వయంగా తల్లి చంపిందని పోలీసుల ఎంక్వౌరీ లో తేలింది. ముద్దు ముద్దుగా ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్న తన కూతురును స్వయంగా ఆ కన్నతల్లి చంపేసింది. ఎందుకో తెలిసి పోలీసులతో పాటు ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. 

అంతే కాకుండా ఆమెను చంపినా తప్పు లేదు అంటూ కనిపిస్తే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ కేసు విషయం ప్రస్తుతం వరంగల్ జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా చర్చనీయాంశంగా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన రాజబోయిన కళ్యాణి కుషాయిగూడ మార్కెట్ వద్ద నివాసం ఉండే నాయక్ వాడి రమేష్ కుమార్ ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018 లో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన సంవత్సరం లోనే కళ్యాణి.. రమేష్ కుమార్ లు తల్లిదండ్రులు అయ్యారు. కూతురు తన్విత తో కలిసి సంసార జీవితం సాఫీగా సాగుతుందని వారి బంధువులు భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలు అయ్యి తారా స్థాయికి చేరుకున్నాయి. దాంతో 2021 ఫిబ్రవరి నుండి కళ్యాణి భర్త రమేష్ కుమార్‌ నుండి దూరం అయ్యి తన తల్లి ఇంట్లో ఉంటూ స్థానికంగా ఉన్న కూరగాయల మార్కెట్‌ లో పని చేసుకుంటూ ఉంది. 

ఒంటరి మహిళగా ఉంటూ తన కూతురు తన్విత ను స్థానికంగా ఉన్న స్కూల్ కి పంపిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే కళ్యాణి దూరపు బంధువు అయిన ఇండ్ల నవీన్‌ తో వివాహేతర సంబంధం మొదలు అయ్యింది. ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం గురించి స్థానికంగా అందరికి తెలుసు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం జరిగింది. కళ్యాణి వయసు 22 కాగా... నవీన్ వయసు 19 ఏళ్లు. అయినా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే తమ అక్రమ బంధానికి.. తమ పెళ్లికి అడ్డుగా తన్విత ఉందని భావించిన వారు పాపను చంపేందుకు ప్లాన్‌ చేశారు. 

Also Read: Aadhaar Card, PAN Card Linking: ఆధార్, పాన్‌ లింక్ చేయని వారికి ఎదురయ్యే సమస్యలు

పాప చనిపోతేనే కళ్యాణికి విడాకులు వస్తాయని భావించి పాపను చంపేందుకు సిద్ధం అయ్యారు. చిన్నారి శనివారం స్కూల్ నుండి వచ్చి పడుకున్న తర్వాత మొహం పై దిండు పెట్టి ఊరిపి ఆడకుండా చేసి చంపేసింది. కూతురును చంపేసిన కళ్యాణి జనాలను నమ్మించడానికి తెగ ప్రయత్నించింది. కూతురు లేవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే కళ్యాణి ప్రవర్తనలో తేడా కనిపించడం తో ఆమెను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దాంతో కళ్యాణి.. నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం కి అడ్డుగా ఉందని కూతురును చంపిన కళ్యాణికి ఏ శిక్ష వేసినా తప్పులేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Heavy Rains Alert: తెలంగాణలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు , బయటికి వెళ్లవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News