Birthday Boy Killed By Friends: బర్త్‌డే పార్టీ ఇచ్చిన ఫ్రెండ్‌నే మర్డర్ చేశారు.. కారణం ఏంటో తెలుసా ?

Birthday Boy Killed By Friends: ముంబై: బర్త్‌డే పార్టీ ఐదుగురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఏకంగా బర్త్ డే పార్టీ ఇచ్చిన స్నేహితుడినే అతడి నలుగురు స్నేహితులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారు. ఇంతకీ ఈ దారుణ హత్యకు కారణం ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. 

Written by - Pavan | Last Updated : Jun 6, 2023, 08:30 PM IST
Birthday Boy Killed By Friends: బర్త్‌డే పార్టీ ఇచ్చిన ఫ్రెండ్‌నే మర్డర్ చేశారు.. కారణం ఏంటో తెలుసా ?

Birthday Boy Killed By Friends: ముంబై: బర్త్‌డే పార్టీ ఐదుగురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. ఆ గొడవ కాస్తా పెద్దది కావడంతో ఏకంగా బర్త్ డే పార్టీ ఇచ్చిన స్నేహితుడినే అతడి నలుగురు స్నేహితులు కలిసి తీవ్రంగా కొట్టి చంపారు. సరదాగా బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం అని ఒక్కచోట చేరిన స్నేహితులు.. అంతా అయ్యాకా బర్త్ డే పార్టీ బిల్లు పంచుకునే విషయంలో గొడవ పడ్డారు. ఊహించని విధంగా ఇదొక పెను వివాదానికి దారితీసింది. ఈ ఘర్షణలోనే పుట్టిన రోజు వేడుకల్లో మునిగిపోయిన 20 ఏళ్ల యువకుడిని అతని నలుగురు స్నేహితులు దారుణ హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హత్యలో పాల్పంచుకున్న నలుగురిలో ఇద్దరు మైనర్స్ కూడా ఉన్నారు.

బర్త్ డే బాయ్ ని హతమార్చి పరారైన నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో యువకులు అయిన ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం జైలుకు పంపించగా.. మైనార్టీ తీరని మరో ఇద్దరు మైనర్ నిందితులను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 31 నాడు పుట్టిన రోజు పార్టీ ఇస్తానని చెప్పిన యువకుడితో సహా మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి ముంబై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోవండిలోని ఒక రోడ్ సైడ్ దాబాలో రాత్రి 8 గంటల సమయంలో పార్టీ చేసుకున్నారు.

బర్త్ డే పార్టీకి రూ. 10,000 వరకు బిల్లు అయింది. ఆ బిల్లు మొత్తాన్ని బర్త్ డే పార్టీ ఇచ్చిన యువకుడే చెల్లించాడు. అయితే, అదే సమయంలో ఆ బిల్లును అందరం కలిసి పంచుకోవాలి అని అందరూ కలిసి నిర్ణయించుకున్నారు. అందుకు అంగీకరించిన మిగతా నలుగురు స్నేహితులు.. పార్టీ తరువాత తమ వాటా మొత్తాన్ని ఇస్తామని అన్నారు. ఎప్పుడైతే బర్త్ డే పార్టీ ఇచ్చిన యువకుడు మిగతా నలుగురిని ఆ డబ్బులు అడిగాడో.. అప్పుడే గొడవ ప్రారంభమైంది.   

బర్త్ డే బాయ్‌కి ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన నలుగురు యువకులు.. అతడిపైనే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ యువకుడు మృతి చెందినట్లుగా డాక్టర్స్ నిర్ధారించారు. తమ స్నేహితుడిని మర్డర్ చేసిన నలుగురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని జువైనల్ హోమ్ కి తరలించారు. మరో ఇద్దరు నిందితులు అహ్మెదాబాద్ లో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. వారిని అక్కడే అరెస్ట్ చేసి ముంబైకి తీసుకొచ్చారు. సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న బర్త్ డే పార్టీ.. అతడి హత్యకే దారితీయడం అందరినీ విస్తుపోయేలా చేసింది.

Trending News