Extramarital Affairs: సీరియల్ నటితో భర్త రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

Extramarital Affairs: ఆధునిక కాలంలో వివాహ బంధాలు దారి తప్పుతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటననే చోటుచేసుకుంది.

Written by - Alla Swamy | Last Updated : Oct 7, 2022, 06:24 PM IST
  • దారి తప్పుతున్న వివాహ బంధాలు
  • కోలీవుడ్‌లో మరో ఘటన
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Extramarital Affairs: సీరియల్ నటితో భర్త రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!

Extramarital Affairs: సినీ పరిశ్రమలో వివాహేతర సంబంధాలు అధికంగా కనిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో ఇలాంటి ఘటననే రిపీట్ అయ్యింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉందని సీరియల్ నటి దివ్యా శ్రీధర్‌ చెన్నై పోలీసులను ఆశ్రయించింది. తమిళ్ సీరియల్ సెవ్వంధీతో ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆ సీరియల్ తర్వాత దివ్య వెనకి తిరిగి చూడలేదు. వరుసగా ఆఫర్లు వచ్చాయి.

కేలాన్ కన్మణి సీరియల్‌లో ఇటీవల ఆమె నటించింది. ఇందులో తనతోపాటు నటించిన ఆర్నావ్‌తో దివ్యా శ్రీధర్‌ ప్రేమలో పడింది. కొన్నిరోజులు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు. ఐతే ఆర్నావ్‌..తనతో కొన్నిరోజులు బాగానే ఉన్నా..ఆ తర్వాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయం తెలిసి పబ్లిక్‌గా తాము గుడిలో పెళ్లి చూసుకున్నామని చెబుతోంది.

పెళ్లి తర్వాత కూడా అతడి తీరు మారలేదని అంటోంది. మరో నటితో అర్నావ్ రాసలీలలు చేస్తూ దివ్యకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దీంతో ఆమె..అతడిని నిలదీసింది. ఐనా ఆర్వావ్ మారకపోగా..తనపై దాడి చేస్తున్నాడని ఆరోపిస్తోంది. తనకు, తన బిడ్డకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త వేరే నటితో వివాహేతర సంబంధం పెట్టుకుని..తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

దివ్యా శ్రీధర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఐతే దివ్యా శ్రీధర్‌ ఫిర్యాదును భర్త ఆర్నావ్ తప్పుపడుతున్నాడు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని అంటున్నాడు. అలాంది ఉంటే నిరూపించాలని..తన పరువుకు నష్టం చేకూర్చుతోందని మండిపడుతున్నాడు.

Also read:IND vs SA: వీరా భారత భావి ఓపెనర్లు..గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌పై నెటిజన్ల ట్రోలింగ్..!

Also read:Viral Video: వామ్మో ఇదేమి రా సామీ..చెట్టును ఇలా ఎక్కేసింది..కొండ చిలువ వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News