Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త

Man Injects Wife With HIV: ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఇంజెక్షన్ ఇప్పించిన తన భర్త.. ఇటీవల హెల్త్ చెకప్ లో తనకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడంతో ఆ నేరం తనపైకి రాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోనే హెచ్ఐవి సోకి ఉంటుందేమోనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 10:18 AM IST
Man Injects Wife With HIV: భార్యకు హెచ్ఐవి బ్లడ్ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త

Man Injects Wife With HIV: భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఒక భర్త అరాచకాలు తీవ్ర స్థాయికి చేరిన ఘటన ఇది. భార్య అదనపు కట్నం తీసుకురావడం లేదనే కోపంతో ఆమెకు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఆమెకు విడాకులు ఇవ్వడం కోసం బలమైన కారణం వెతుక్కున్నాడు. ఏ కారణం లేకుండా విడాకులు అడగలేననే ఉద్దేశంతో కుట్రపన్నాడు. ఆమెకు ఎయిడ్స్ సోకిన వ్యక్తి రక్తాన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించాడు. 

హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే కానీ భార్యకు ఈ విషయం తెలిసి రాలేదు. దీంతో ఆమె తన న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఏపీలోని తాడేపల్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. 2018 కి ముందు వరకు తన భర్త తనతో సరిగ్గానే ఉండేవాడని.. ఆ తరువాతే అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. విశాఖపట్నంకు చెందిన 21 ఏళ్ల యువతితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని... తనపై వేధింపులు పెరగడానికి అది కూడా ఒక కారణమైందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆరోగ్యం బాగుంటుందని చెబుతూ హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ ఇంజెక్షన్ ఇప్పించిన తన భర్త.. ఇటీవల హెల్త్ చెకప్ లో తనకు హెచ్ఐవి పాజిటివ్ అని తేలడంతో ఆ నేరం తనపైకి రాకుండా ప్రెగ్నెన్సీ సమయంలోనే హెచ్ఐవి సోకి ఉంటుందేమోనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. బాధితురాలి ఫిర్యాదుని స్వీకరించిన తాడేపల్లి పోలీసులు.. శుక్రవారమే ఆమె భర్త చరణ్ పై (40) కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి : Gang Rape: 16 ఏళ్ల బాలికపై గాంగ్ రేప్,, 8 మంది కలిసి 14 గంటలపాటు దారుణంగా! 

ఇది కూడా చదవండి : Inspired By Shradda Walker Case: శ్రద్దా వాకర్ కేసు చూసి పిన్నిని పది ముక్కలు చేసిన వ్యక్తి.. దారుణాతి దారుణంగా!

ఇది కూడా చదవండి : Jharkhand Murder Case: పెళ్లైన పది రోజులకే దారుణం.. శ్రద్ధా హత్య తరహాలోనే జార్ఖండ్‌లో ఘోరం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News