Gang Rape: అర్థరాత్రి వివాహితపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్‌

హనంకొండలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ మహిళపై మరో ఇద్దరు డ్రైవర్‌ లతో కలిసి సదరు ఆటో డ్రైవర్‌ గ్యాంగ్‌ రేప్ కు పాల్పడ్డ సంఘటన హనుమకొండ సర్కిల్‌ పరిధిలో జరిగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2023, 06:26 PM IST
Gang Rape: అర్థరాత్రి వివాహితపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్‌

Gang Rape: మహిళలపై అఘాయిత్యాలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా కూడా దారుణాలు మాత్రం ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశ వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక మూల ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రేప్ కేసులు ప్రతి రోజు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. చిన్న పిల్లలు, వృద్ద మహిళలు, వివాహితలు ఏ ఒక్కరిని కూడా వదిలి పెట్టకుండా కామాంధులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 

దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో రేప్‌ కేసులు ఎక్కువ ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇటీవల రాత్రి 12 గంటల సమయంలో వివాహిత ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆ మహిళపై మరో ఇద్దరు డ్రైవర్‌ లతో కలిసి సదరు ఆటో డ్రైవర్‌ గ్యాంగ్‌ రేప్ కు పాల్పడ్డ సంఘటన హనుమకొండ సర్కిల్‌ పరిధిలో జరిగింది. 

సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ నయీంనగర్ కి చెందిన వివాహిత ఏప్రిల్‌ 27వ తారీకున పనిమీద బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేప్పటికి మద్య రాత్రి అయ్యింది. కేయూ క్రాస్ వద్ద వివాహిత ఆటోను ఆపి రంగ్ బార్ వద్దకు వెళ్లాలని చెప్పింది. డ్రైవర్ రాకేష్‌ ఆమెను ఎక్కించుకుని తన స్నేహితులు అయిన ఆటో డ్రైవర్‌ లు సనత్ మరియు సతీష్‌ లకు ఫోన్ చేశాడు. 

కొద్ది సేపటికే వారు రాకేష్ ఆటోను చేరుకున్నారు. ఆటోలో వారు ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది. మహిళ చెప్పిన వైపుకు కాకుండా రాకేష్ ఆటోను మరో వైపుకు తీసుకు వెళ్తుండటంతో అనుమానం వచ్చిన మహిళ అరవడం మొదలు పెట్టిందట. ఆ సమయంలో రాకేష్‌ స్నేహితులు ఆమెను అరిస్తే చంపేస్తాం అంటూ బెదిరిస్తూ భీమారం గ్రామ శివారులోకి తీసుకు వెళ్లారు.

Also Read:  Ustaad Bhagat Singh : గబ్బర్ సింగ్‌ను మించేలా.. ఉస్తాద్ కోసం రంగంలోకి దేవి శ్రీ ప్రసాద్

ఆటోలో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ సాంగ్‌ ను పెద్దగా పెంచి ఆమె అరుపులు వినిపించకుండా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళను రంగ్ బార్‌ వద్ద వదిలేసి వెళ్లి పోయారు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పిన వివాహిత వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పరీక్షల అనంతరం పేర్కొన్నారు. నిందితులకు క్రైమ్‌ హిస్ట్రరీ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. పోలీసులు ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Also Read: New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News