Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Odisha Bus Accident Latest Update: ఒడిశాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 26, 2023, 12:09 PM IST
Odisha Bus Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Odisha Bus Accident Latest Update: ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే.. మరో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సులు ఢీకొని 12 మంది మృతిచెందారు. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దిగపహంది సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఎంకేసీజీ వైద్య కళాశాలకు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా..

బ్రహ్మపురలో వివాహానికి బస్సులో వెళ్లిన పెళ్లి బృందం.. వివాహం అనంతరం ఆదివారం తిరిగి బస్సులో వస్తోంది. దిగపహంది సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న మరో బస్సును వీరి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. ఆరుగురు ఎంకేసీజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గంజాం కలెక్టర్ దివ్యజ్యోతి పరిదా వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని కటక్‌లోని ఎస్‌సీబీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రోగులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఓఆర్‌టీసీ, ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని బహరంపూర్‌ ఎస్పీ శరవణ వివేక్‌ తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పలువురు ప్రయాణికులను రక్షించారు. 

 

ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒడిశా ప్రభుత్వం గంజాం పాలకవర్గం ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి రూ.30 వేలు అందజేస్తున్నారు. 

Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ  

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News