Reviews and Rating Jobs: రివ్యూలు రాసి, రేటింగ్ ఇస్తే చాలు మీ ఖాతాలో వేలకు వేలు

Cyber Crime News: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రోజుకొక కొత్త ఐడియాతో అమాయక జనాన్ని, అత్యాశపరులను నిలువునా దోచేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా రోజుకొక కొత్త పంథాను ఎంచుకుని ఈజీ మనీ ఆశ చూపించి... ఆ తరువాత భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. 

Written by - Pavan | Last Updated : Jun 20, 2023, 06:13 PM IST
Reviews and Rating Jobs: రివ్యూలు రాసి, రేటింగ్ ఇస్తే చాలు మీ ఖాతాలో వేలకు వేలు

Cyber Crime News: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. రోజుకొక కొత్త ఐడియాతో అమాయక జనాన్ని, అత్యాశపరులను నిలువునా దోచేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా రోజుకొక కొత్త పంథాను ఎంచుకుని ఈజీ మనీ ఆశ చూపిస్తున్నారు. ఆ ఈజీ మనీ కోసం ఆశపడిన వాళ్లు భారీ మొత్తంలో జేబులు గుళ్ల చేసుకోవడమే కాకుండా తమ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకోవడంతో పాటు కొత్త అప్పులు కూడా చేసి ఇంకొన్ని చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. 

ఒక్కసారి ఈజీ మనీ కోసం ఆశపడి సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడ్డారే అనుకోండి... ఇక అంతే సంగతి.. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. అంత తెలివిగా మీకే తెలియకుండా మీ కష్టార్జితాన్ని దోచేస్తున్నారు. తాము మోసపోయామని బాధితులకు తెలిసేలోగానే అంతా జరిగిపోతుంది.. ఆ తరువాతి నుంచి అవతలి వైపు నుంచి కమ్యూనికేషన్ కట్ అవుతుంది. ఇలా నిత్యం ఎంతో మంది సైబర్ నేరాల బారిన పడి మోసపోతున్నప్పటికీ.. ఎన్నో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. ఇంకా మోసపోయే వారి సంఖ్యకు మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు.

తాజాగా ముంబైలో జరిగిన ఓ సైబర్ క్రైమ్ నేపథ్యం గురించి తెలుసుకుంటే మీరు అవాక్కవడం పక్కా. అంత ఈజీగా అలా ఎలా మోసపోతారు అనే సందేహం కూడా కలగకమానదు. ఆన్ లైన్ ద్వారా హోటల్స్ కి రివ్యూలు రాసి, రేటింగ్ ఇస్తే మీకు భారీ మొత్తంలో డబ్బు ఇస్తాం అంటూ సెంట్రల్ ముంబై ప్రాంతానికి చెందిన ఒక 53 ఏళ్ల వ్యక్తికి ఒక మహిళ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నిజమే అని నమ్మిన ఆ వ్యక్తి.. ఆ మహిళతో సంప్రదింపులు మొదలుపెట్టాడు.

ఇది కూడా చదవండి: Robbery Inspired by Movies: స్పెషల్ 26, గ్యాంగ్ సినిమాలు చూసి జువెలరీ షాపులో చోరీ.. అరెస్ట్!

ఈ రివ్యూస్ అండే రేటింగ్ పని అప్పగించడానికంటే ముందుగానే ఏ ఖాతాలో అతడికి ఇచ్చే డబ్బులు జమ చేయాలి అని అడిగి తెలుసుకుని ఆ బ్యాంక్ ఎకౌంట్ వివరాలు అతడి నుంచే తీసుకున్నారు. డబ్బెవరికి చేదు.. ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే చాలు.. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఏ వివరాలు ఆరా తీయకుండానే అడిగిన వివరాలు చెప్పే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ వ్యక్తి కూడా అదే తొందరపాటుతో తన బ్యాంక్ డీటేల్స్ అన్ని ఇచ్చేశాడు. ఆ తరువాత ఆ మహిళ ఒక యూజర్ ఐడి, పాస్ వర్డ్ పంపించింది. ఆ వివరాలతో అతడు లాగిన్ అయ్యాడు.  

అక్కడి నుంచే అసలు మోసం షురూ అయింది.
ఈ వాలెట్ లో రూ. 10 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా అడిగింది. ఆమె అడిగినట్టే 10 వేలు డిపాజిట్ చేశాడు. తొలుత అతడిని నమ్మించడం కోసం కొన్ని లింక్స్ పంపించిన ఆ మహిళ.. అతడి చేత కొన్ని హోటల్స్ కి రివ్యూలు రాయించి, రేటింగ్స్ ఇవ్వమని అడిగింది. ఆమె చెప్పినట్టుగానే ఆ పని చేసిన ఆ వ్యక్తి.. తాను రాసిన రివ్యూలు, రేటింగ్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఆమెతో పంచుకున్నాడు. ఆ తరువాత ఈ వాలెట్ చెక్ చేసుకోవాల్సిందిగా చెప్పిందామె. అతడు తన ఈ-వాలెట్ చెక్ చేసి చూస్తే అప్పటికే అందులో 17,372 వేల రూపాయలు బ్యాలెన్స్ చూపించింది. అది చూసి 7 వేలు సంపాదించాను అనే ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అది తనను నమ్మించడం కోసం వేసిన గాలం అని అప్పుడు తెలుసుకోలేకపోయాడు. 

ఈసారి ఇంకొన్ని హోటల్స్ కి రివ్యూలు రాసి రేటింగ్స్ ఇవ్వాల్సిందిగా మళ్లీ పని అప్పజెప్పారు. అంతకంటే ముందుగా రూ. 32,000 జమ చేయాల్సిందిగా అడిగింది. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఆమె చెప్పినట్టే డబ్బులు డిపాజిట్ చేసి, రివ్యూలు రాసి, రేటింగ్స్ ఇచ్చాడు. ఆ స్క్రీన్ షాట్స్ ఆమెకు పంపించాడు. ఈసారి ఈ వాలెట్ చెక్ చేస్తే.. అందులో రూ. 55 వేలు కనిపించాయి. ఈసారి ఆనందానికి ఇక అవధుల్లేకుండా పోయాయి. ఇంత చిన్న పనికే ఎంత మొత్తం వచ్చిందో అని ఎగ్గిరి గంతేశాడు. కానీ అదే తన ఆఖరి ఆనందం అని తెలుసుకోలేకపోయాడు.

ఇది కూడా చదవండి: Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు

ఈసారి మహిళ ఖాతాలో మరో రూ. 50 వేలు జమ చేశాడు. అయితే, ఏదో సాంకేతిక లోపంతో ఆ డబ్బులు తనకు రాలేదని.. మళ్లీ 50 వేల రూపాయలు పంపించాల్సిందిగా ఆ మహిళ కోరింది. అప్పటికే ఆ మహిళను పూర్తిగా నమ్మిన ఈ వ్యక్తి.. ఆమె చెప్పినట్టుగానే చేస్తూ.. ఆమె ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో అడిగినంత మొత్తం డిపాజిట్ చేస్తూ వెళ్లాడు. అలా మొత్తం 48 లక్షలు డిపాజిట్ చేశాడు. ఈ వాలెట్ చెక్ చేస్తే.. అతడికి రూ. 60 లక్షలు లాభం వచ్చినట్టు చూపించింది. 

ఈ వాలెట్ లో ఉన్న ఆ రూ. 60 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే.. అదనంగా మరో రూ. 30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అని అడిగింది. అప్పటికే ఆమెని పూర్తిగా నమ్మిన ఆ వ్యక్తి.. ఆమె కోరినట్టుగానే లక్షల మొత్తంలో డిపాజిట్ చేస్తూ వచ్చాడు. అలా మే 18 నాటికే వివిధ బ్యాంకు ఖాతాల్లో కలిపి మొత్తం రూ. 76 లక్షలు చెల్లించాడు. ఎన్ని లక్షలు డిపాజిట్ చేసినా.. తనకు తిరిగి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఈసారి పోలీసులను ఆశ్రయించాడు. 

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సెంట్రల్ ముంబైలోని సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో తేలింది ఏంటంటే.. పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్‌లోని బ్యాంక్ ఎకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయినట్టు గుర్తించారు కానీ ఆ కిలాడీ సైబర్ క్రిమినల్‌ని మాత్రం పట్టుకోలేకపోయారు. తను కొత్త ఇల్లు కొనుక్కోవడం కోసం కష్టపడి దాచుకున్న సొమ్మును తనకే తెలియకుండా ఇలా సైబర్ దొంగలపాలుచేసుకున్నాడు. మొత్తానికి అతడికి తెలియకుండానే.. నొప్పి కూడా లేకుండానే మొత్తం రూ. 1.27 కోట్లు కొట్టేశారు. నిత్యం ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎన్నో వెలుగుచూస్తున్నప్పటికీ.. ఈజీగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో జనం ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరస్తులు కూడా తొలుత చిన్నపాటి ఎమౌంట్ ఆశచూపి నమ్మబలుకుతూ.. ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Cinematic Crime Sory: 13 ఏళ్ల మైనర్ బాలిక కిడ్నాప్.. పెళ్లి పేరుతో 15 మందికి అమ్మకం.. ప్రతీ చోట ఒక కిడ్నాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News