ఆర్కే బీచ్‌ లో యువతి మృతదేహం.. అర్ధ నగ్నంగా ఉండటంతో పలు అనుమానాలు

ప్రశాంతమైన ఆర్కే బీచ్ లో అర్థ నగ్నంగా యువతి శవం కనిపించటం సంచలనం రేపింది. హత్యా - ఆత్మహత్య నిర్దారణ కొరుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2023, 01:44 PM IST
ఆర్కే బీచ్‌ లో యువతి మృతదేహం.. అర్ధ నగ్నంగా ఉండటంతో పలు అనుమానాలు

Dead Body found in RK Beach: ప్రశాంత విశాఖ ఆర్కే బీచ్‌ లో యువతి మృతదేహం సంచలనంగా మారింది. యువతి మృతదేహం నార్మల్ గా కాకుండా అర్థ నగ్నంగా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత యువతిని గంట్యాడ కు చెందిన శ్వేతగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. యువతి మృతదేహంకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈమధ్య కాలంలో విశాఖ పట్నం బీచ్‌ ల్లో ఇలాంటి సంఘటనలు పదే పదే జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి సమయంలో వైఎంసీఏ ఎదుట బీచ్ లో యువతి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందట. పోలీసులు యువతి మృతదేహం అర్థనగ్నంగా ఉండటంతో పాటు కాస్త కుల్లిపోయి కనిపించడంతో చనిపోయిన తర్వాత సముద్రంలో పడవేసి ఉంటారని... ఆ తర్వాత ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మృతురాలు శ్వేతగా గుర్తించడంతో కేసులో పురోగతి సాధించినట్లే అన్నట్లుగా పోలీసు వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

శ్వేత బ్యాక్ గ్రౌండ్ మరియు ఆమె కాల్‌ డేటా ను పరిశీలించి కేసును ముందుకు తీసుకు వెళ్లబోతున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం న్యూ పోర్ట్‌ పోలీసు స్టేషన్ లో యువతి మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఇంతలోనే సముద్రంలో మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్వేత మృతిపై కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కాస్త డెప్త్‌ గా ఈ కేసును విచారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎంక్వౌరీ మొదలు అయ్యిందని.. అతి త్వరలోనే కేసులో పురోగతి సాధించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Also Read: User Charges Hike: సైలెంట్‌గా షాకిచ్చిన ప్రభుత్వం.. భారీగా ధరలు పెంపు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News