Producers Guild: ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే!

Active Telugu Film Producers Guild announces Shootings Bundh: యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారికంగా సినిమా షూటింగులు నిలిపివేస్తున్నట్లు ప్రెస్ నోట్ జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2022, 08:08 PM IST
Producers Guild: ఆగష్టు 1 నుంచి షూటింగ్స్ బంద్.. మళ్లీ ఎప్పటి నుంచి అంటే!

Active Telugu Film Producers Guild announces Shootings Bundh: ఎట్టకేలకు ఊహించినదే జరిగింది. యాక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధికారికంగా సినిమా షూటింగులు నిలిపివేస్తున్నట్లు ప్రెస్ నోట్ జారీ చేసింది. కరోనా తర్వాత పరిస్థితిలో ఆదాయ వనరులు మారిపోయాయని నిర్మాణ వ్యయం పెరిగిపోయిందని ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. నిర్మాతలు అందరూ కలిసి కూర్చుని ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద చర్చించాల్సిన సమయం వచ్చిందని ప్రెస్ నోట్ లో ప్రోడుసర్స్ గిల్డ్ పేర్కొంది.

సినిమాను ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్మించి విడుదల చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఉన్న అందరూ యాక్టివ్ నిర్మాతలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు నిలిపివేసి నిర్మాణం తగ్గించుకుని మళ్ళీ సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్మించే విధంగా డిస్కషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ లెక్కన ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగులు నిలిచిపోవడం ఖాయమని తెలుస్తోంది.

ఇప్పటికే దీనికి సంబంధించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడంతో షూటింగ్ నిలిపివేసి నిర్మాతలు అందరూ హీరోల రెమ్యూనరేషన్ల విషయం అలాగే నటీనటుల వ్యక్తిగత సిబ్బంది వంటి విషయాల మీద చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే మేనేజర్లు,  కోఆర్డినేటర్ల వ్యవస్థ మీద ఒక సమీక్ష జరిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read Also: Tollywood: టాలీవుడ్‌ నిర్మాతల సంచలన నిర్ణయం.. ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్

Read Also:  Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News