Actor Urmila kothare car accident metro worker died: సాధారణంగా రోడ్లు మీద వాహనాలు నడిపిస్తున్నప్పుడు అతి వేగం, తాగి వాహానాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు చెబుతు ఉంటారు. కానీ కొంత మంది మాత్రం పోలీసుల సూచనల్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. కొంత మంది కావాలని వాహానాల్ని నెగ్లీ జెన్సీతో నడిపిస్తుంటారు. దీని వల్ల అనుకొని ఘటనలు చోటు చేసుకుంటాయి.
తమ దారిన తాము జాగ్రత్తగా వెళ్లేవాళ్లు మాత్రం.. కొన్ని సందర్భాలలో నెగ్లీజెన్సీతో వాహనాలు నడిపేవారి బారిన పడుతుంటారు. కొన్నిసార్లు వారి ప్రాణాలు సైతం గాల్లొ కలుస్తుంటాయి. కొన్నిసార్లు తప్పతాగి వాహానాల్ని నడిపిస్తుంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా అమాయకులు చనిపోయిన ఘటనలు కొకొల్లలు. ఈ క్రమంలో ఒక హీరోయిన్ వాహానం ప్రమాదంలో ఒక నిండు ప్రాణం బలైన సంఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
ముంబైలోకి కాండివిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరాఠి నటి అయిన ఉర్మిళ కోఠారి తన కారులో వెళ్తుంది. అక్కడ మెట్రో దగ్గర పనులు జరుగుతున్నాయి. అక్కడ కార్మికులు తమ పనులు చేసుకుంటున్నారు. అయితే.. కారు వేగంగా వెళ్లి అక్కడ పని చేస్తున్న వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు ప్రమాదంలో సంఘటన స్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తొంది.
మరొవైపు ఈ ఘటనలో.. నటి, ఆమె డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకొవడం వల్ల నటి, ఆమె డ్రైవర్ మాత్రం పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరగ్గానే.. చుట్టుపక్కల వారు.. కారును చుట్టుముట్టినట్లు తెలుస్తొంది.
Read more: Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్... పవన్ కళ్యాన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..?
పోలీసులుఅక్కడికి చేరుకుని నటి డ్రైవర్ పై కేసును నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం మరాఠి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. కారు అతివేగం వల్లనే ఈఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter