Roopa Koduvayur: టాలీవుడ్‌లో సరికొత్త టాలెంటెడ్ రూప కొడువాయూర్.. తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ

Actress Roopa Koduvayur: తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. తన టాలెంట్‌తో వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. తొలి సినిమా ఓటీటీలో విడుదలైనా మంచి పేరును సంపాదించుకుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 07:20 PM IST
Roopa Koduvayur: టాలీవుడ్‌లో సరికొత్త టాలెంటెడ్ రూప కొడువాయూర్.. తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ

Actress Roopa Koduvayur: రూప కొడువాయూర్ పేరు ఏదో మలయాళి అమ్మాయిలా ఉన్నా.. అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్‌తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపిచ్చే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్‌ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగింది. తన మొదటి సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల అయినా.. కేవలం తన నటనా ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. మరోవైపు వైద్యురాలిగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. లండన్‌లో ఎండీ చేయడానికి ప్లాబ్ 2 పరీక్షకు సన్నద్దం అవుతోంది. 

రూప బేసిగ్గా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సునాయసంగా నటించగలదు. అద్భుతమైన హవభావాలు పలికిస్తోంది. అదే ఈ అమ్మడుకు ప్లస్ అయింది. అందుకే స్క్రీన్‌లో తాను ఎంత సమయం ఉన్నా అలా చూస్తూ ఉండి పోతామని అభిమానులు అంటున్నారు. ఎంత మంది ఉన్నా రూప ప్రత్యేకంగా కనిపిస్తుందని చెబుతున్నారు. మంచి అవకాశలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ ముద్దుగుమ్మ లీడ్ రోల్‌లో నటించిన ఓ యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ డిసెంబర్‌లో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదలకు ముస్తాబు అవుతోందని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతున్నట్లు తెలిసింది. తెలుగు అమ్మాయిలను పరిశ్రమకు ఆహ్వానించే దర్శక నిర్మాతలకు రూప కొడువాయూర్ మంచి ఆప్షన్‌గా మారింది. సరైన హిట్ పడితే.. ఈ బ్యూటీ కెరీర్‌కు ఊపు వస్తుందని అభిమానులు అంటున్నారు. భవిష్యత్‌లో మరిన్ని పాత్రలతో అలరించేందుకు సిద్ధమని రూప కొడువాయూర్ చెబుతోంది.

Also Read: IND Vs PAK Updates: టాస్ గెలిచిన టీమిండియా.. రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ..!  

Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News