Shruti Haasan: స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కు కరోనా

Actress Shruti Haasan: నటి శ్రుతిహాసన్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకుని త్వరలో తిరిగి వస్తానని ఆమె అన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 01:44 PM IST
Shruti Haasan: స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ కు కరోనా

Shruti Haasan tests positive for COVID-19: స్టార్​ హీరోయిన్​ శ్రుతిహాసన్ (Actress Shruti Haasan)  కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. "నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. తిరిగి ఎప్పటిలాగే నా పనుల్లో పాల్గొనాలని చూస్తున్నా. మిమ్మిల్ని త్వరలోనే మళ్లీ కలుస్తా" అని శ్రుతి పేర్కొంది  ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. 

 ప్రస్తుతం ఆమె ప్రభాస్​ 'సలార్' (Salaar)​, బాలయ్య 107వ సినిమాలోనూ నటిస్తున్నారు.  శ్రుతి ఇటీవల నటించిన వెబ్ సిరీస్ 'బెస్ట్ సెల్లర్' (Bestseller) ఫిబ్రవరి 18న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.  శ్రుతి తండ్రి, దిగ్గజ నటుడు కమల్​హాసన్​ ఇటీవల కరోనా  నుంచి కోలుకున్నారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 10,273 కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 20,439 మంది రికవరీ అయ్యారు. వైరస్​ తో 243 మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 1,11,472 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 177,44,08,129 టీకా డోసులు పంపిణీ చేశారు. 

Also Read: Russia Ukraine Conflict: ఇండియాపై కూడా ఆ ప్రభావం.. ఇంధన ధరలు భారీగా పెరిగే ఛాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News