Aditi Rao Hydari - Siddharth :అదితి – సిద్దార్థ్ రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. దీనికి నేనే కారణం అనుకుంటున్నారు అంటూ పోస్ట్

Ajay Bhupathi : సిద్ధార్థ అతిథి రావు హైదరి ప్రేమలో ఉన్నారు అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వీరిద్దరూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా ఉంటూ వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ ఎన్నోసార్లు బయట జతగా కూడా కనిపించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఒక దర్శకుడు వీరిద్దరి ఫోటో పెట్టి మరి వేసిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.. అది ఏమిటో ఒకసారి చూద్దాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 05:10 PM IST
Aditi Rao Hydari - Siddharth :అదితి – సిద్దార్థ్ రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన డైరెక్టర్.. దీనికి నేనే కారణం అనుకుంటున్నారు అంటూ పోస్ట్

Aditi Rao Hydari - Siddharth :ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ తదుపరిచిత్రంగా శర్వానంద్ తో మహాసముద్రం తీశారు. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ కూడా నటించాడు. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ కి జోడిగా అతిథి రావు నటించింది. కాగా సిద్ధార్థ, అతిథి రావు మొదటిసారిగా కలిసింది ఈ సినిమా సెట్స్ లోనే. అక్కడి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం మొదలై ఆ తరువాత అది స్నేహంగాను అలానే ప్రేమగానే మారింది అని వినికిడి. ఇక దీనికి తగ్గట్టే వీరిద్దరూ పలుమార్లు పలు దగ్గరలో మీడియాకి దొరికారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా వీరిద్దరూ కలిసి వెళ్లారు. ఇక ఇటీవల సిద్దార్థ చిన్నా సినిమా బాలీవుడ్ ప్రీమియర్ కి అదితి దగ్గరుండి అన్ని చూసుకుంది. తాజాగా నిన్న అక్టోబర్ 28న అదితి రావు హైదరీ పుట్టినరోజు కావడంతో అదితి, సిద్దార్థ్ క్లోజ్ గా దిగిన ఫోటోని షేర్ చేసి సిద్దార్థ్ స్పెషల్ గా బర్త్ డే విషెస్ పోస్ట్ చేశాడు. ఇక దీంతో ప్రేక్షకులందరూ వీరిద్దరి మధ్య తప్పకుండా ప్రేమ ఉందని త్వరలోనే పెళ్లి గురించి చెప్పచ్చు అని ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ నేపథ్యంలో మహాసముద్రం డైరెక్టర్ అజయ్ భూపతి కూడా వీరిద్దరూ కలిసి ఉన్న అదే ఫోటోని షేర్ చేసి అందరూ దీనికి నేనే కారణం అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అని రాసుకు వచ్చారు. అంతేకాదు ఆ పోస్ట్ కి సిద్దార్థ్, అదితిలను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అయింది.

ఇక మహాసముద్రం సినిమా దగ్గరనుంచి సిద్ధార్థ, అతిథి క్లోజ్ కావడంతో వీరిద్దరూ ప్రేమలో పడటానికి కారణం అజయ్ భూపతినే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట పెళ్లి చేసుకుంటుందా లేక ఇలాగే డేటింగ్ చేస్తూ ఇంకెన్నాళ్లు గడుపుతారో చూడాలి. మొత్తానికి ప్రస్తుతం మాత్రం ఈ డైరెక్టర్ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

Trending News