Akshay Kumar: ఆ దెబ్బతోనే కెనడా పౌరసత్వం.. దేశం వదిలి పోవాలనుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన అక్షయ్

Akshay Kumar opens up about his Canadian citizenship: తన కెనడియన్ పౌరసత్వం గురించి,  తన కెనడియన్ పాస్ పోర్ట్ గురించి అక్షయ్ కుమార్ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 03:34 PM IST
Akshay Kumar: ఆ దెబ్బతోనే కెనడా పౌరసత్వం.. దేశం వదిలి పోవాలనుకున్నా.. అసలు విషయం బయటపెట్టిన అక్షయ్

Akshay Kumar opens up about his Canadian citizenship: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ గురించి ఎక్కువగా ఒక ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయనకు కెనడియన్ వారసత్వం కూడా ఉందనే విషయంలో ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే తాజాగా తాను కెనడా వెళ్లి స్థిరపడాలని అనుకున్నానని అందుకే కెనడా పౌరసత్వం తీసుకోవడమే గాక కెనడా పాస్పోర్ట్ కూడా తీసుకున్నట్లుగా అక్షయ్ కుమార్ వెల్లడించారు.

తాను చేసిన 14- 15 సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అందుకున్న తర్వాత తనకు సినిమాలు కలిసి రావేమో అనే ఉద్దేశంతో కెనడా వెళ్లి అక్కడే ఏదో ఒక పని చేసుకుని స్థిరపడాలని అనుకున్నానని ఆయన వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడేవి కాదన్న ఆయన  దాదాపు 14- 15 సినిమాలు ప్లాప్లులుగా నిలవడంతో నేను ఇంకా ఎక్కడికైనా వెళ్లి పని చేయాలని అనుకున్నానని అన్నారు.

నిజానికి కెనడాకి చాలామంది భారతీయులు వెళతారు, పనిచేస్తూ ఉంటారు కానీ వాళ్ళు భారతీయులుగానే మిగిలిపోతారు కదా, అందుకే నేను కూడా అలాగే అనుకుని అక్కడికి వెళదాము అనుకున్నాను, ఇక్కడ నన్ను ప్రజలు సపోర్ట్ చేయకపోతే అక్కడికి వెళ్లి ఏదో ఒక పని చేయాలని అనుకున్నానని అక్షయ్ కుమార్ అన్నారు. అక్కడికి వెళ్లాను, అక్కడి పౌరసత్వం కోసం అప్లై చేశాను వాళ్లు పౌరసత్వం ఇచ్చారు అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

అలాగే తనకు కెనడియన్ పాస్పోర్ట్ ఉందనే విషయం మీద ఆయన మాట్లాడుతూ అవును నాకు కనెడియన్ పాస్పోర్ట్ ఉంది, అసలు పాస్పోర్ట్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లడానికి వాడే ఒక డాక్యుమెంట్ కదా. చూడండి, నేను ఒక భారతీయుడిని నేను అన్ని టాక్స్ లు, మన దేశానికే కడతాను నేను ఇక్కడే ఉంటాను. నాకు అక్కడ కూడా టాక్స్ కట్టే అవకాశం ఉంది కానీ నేను ఇక్కడే కట్టాలనుకుంటున్నానని అన్నారు. నేను ఈ దేశంలో పనిచేస్తున్నాను, నేనెప్పటికీ భారతీయుడిని అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. 

Also Read: Anasuya Bharadwaj: ఆ ఊబిలో నుంచి అందుకే బయటపడ్డా.. జబర్దస్త్ వీడడంపై అనసూయ సంచలన వ్యాఖ్యలు!

Also Read: karthikeya 2: హిట్ టాక్ తో దూసుకుపోతున్న కార్తికేయ 2.. మొదటి రోజే భారీ వసూళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News