Pushpa 2 Movie Budget: పుష్ప 2 మూవీ బడ్జెట్ రూ 400 కోట్లా ? తగ్గేదేలేదా ?

Pushpa 2 Movie Budget: అల్లు అర్జున్‌కి, రష్మిక మందనకు, దర్శకుడు సుకుమార్‌కి అంత గుర్తింపును తీసుకొచ్చిన పుష్ప మూవీ రెండో భాగం పుష్ప ది రూల్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 01:10 AM IST
  • పుష్ప ది రూలర్ సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు ?
  • పుష్ప పార్ట్ 2 కోసం వెచ్చిస్తున్న బడ్జెట్ ఎంత ?
  • పుష్ప 2 మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చేదెప్పుడు ?
Pushpa 2 Movie Budget: పుష్ప 2 మూవీ బడ్జెట్ రూ 400 కోట్లా ? తగ్గేదేలేదా ?

Pushpa 2 Movie Budget: పుష్ప 2 మూవీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా ఇది. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుష్ప మూవీతో పాటు అందులోని పాటలు, డైలాగ్స్‌కి ఆడియెన్స్ నుంచి భారీ స్పందన కనిపించింది. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదెలే డైలాగ్ నుండి సామి సామి పాట వరకు ప్రతీ పాట, ప్రతీ డైలాగ్ భారీగా పాపులర్ అయ్యాయి. దీంతో ఇప్పటికే అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన రష్మిక మందనకు కూడా నేషనల్ వైడ్ పాపులారిటీ లభించింది. 

అల్లు అర్జున్‌కి, రష్మిక మందనకు, దర్శకుడు సుకుమార్‌కి అంత గుర్తింపును తీసుకొచ్చిన పుష్ప మూవీ రెండో భాగం పుష్ప ది రూల్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అంతకంటే ఒక నెల ముందుగానే.. అంటే జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా పుష్ప 2 మూవీ అప్ డేట్స్ కోసం వేచిచూస్తున్న ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమాని ఒకరు చేసిన ట్విటర్ పోస్ట్ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించకుండాపోలేదు. 

allu-arjun-pushpa-2-movie-shooting-date-budget-latest-updates.jpg

పుష్ప పార్ట్ 2 మూవీ గురించి అల్లు అర్జున్ అభిమాని చేసిన ఆ ట్వీట్‌లో ఏముందంటే.. పుష్ప పార్ట్ 2 మూవీ రూ. 400 కోట్ల బడ్టెట్‌తో తెరకెక్కనుందని, జూలై 2022 లో పట్టాలెక్కనున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవి సెలవులు నాటికి విడుదల కానుందని సదరు అభిమాని తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. హీరోల అభిమానులు చేసే ట్వీట్స్ ఎప్పుడూ అధికారిక ప్రకటనలు కానప్పటికీ.. అందులో అతడు పేర్కొన్న రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ అనే వివరాలు మాత్రం నెటిజెన్స్‌లో చర్చకు దారితీశాయి. 

allu-arjun-pushpa-2-movie-shooting-date-budget-latest-updatess.jpg

పుష్ప ది రైజ్ మూవీ టోటల్ రన్‌లోనే రూ. 400 కోట్ల వసూళ్లు సాధించలేదని.. అటువంటప్పుడు పుష్ప ది రూల్ కోసం అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ వెచ్చించి సినిమా ఎలా తీస్తారంటూ కొంతమంది నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

allu-arjun-pushpa-2-movie-shooting-date-budget-latest-update.jpg

ఇంకొంతమంది మాత్రం దీన్ని ఒక ఫేక్ న్యూస్‌గా అభివర్ణించారు. అంతే కాకుండా.. పార్ట్ 2 కోసం ఎగ్జైట్ అయ్యేంత కంటెంట్ పార్ట్ 1 లో ఏమైనా ఉందా అంటే అది కూడా లేదని.. అందుకే పార్ట్ 2 బడ్జెట్‌కి దాదాపు రూ. 100 కోట్లు వెచ్చించడం వరకు ఓకే అంటూ మరో అభిమాని పేర్కొన్నాడు. మొత్తానికి పుష్ప 2 మూవీ బడ్జెట్ ఎంత ఉంటుందనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇలా అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాని పెట్టిన ఓ పోస్ట్ కారణంగా ఆ సినిమాపై అభిమానులు నెటిజెన్స్ తమ అభిప్రాయాలను మాత్రం పంచుకోవడం మనం సోషల్ మీడియాలో చూడొచ్చు.

Also read : Karate Kalyani meets collector : రేపు మరోసారి విచారణకు కరాటే కల్యాణి

Also read : karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News