Sonam Kapoor: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్

అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ అభిమానులకు గుడ్ న్యూస్  చెప్పింది. గర్భంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వగా..  సెలబ్రెటీలు సోనమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 05:39 PM IST
  • గుడ్ న్యూస్ చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌
  • తల్లి కాబోతున్నానని వెల్లడి
  • కంగ్రాట్స్ చెబుతున్న పలువురు సెలబ్రిటీలు
Sonam Kapoor: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్

Sonam Kapoor Announces Pregnancy: బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ అభిమానులకు శుభవార్త తెలిపింది. మొదటగా ఇండస్ట్రీకి స్టార్ హీరో కూతురుగా పరిచయం అయినప్పటికీ, తనకంటూ సొంతంగా స్థానాన్ని, అభిమానులను ఏర్పరచుకుంది. నిజానికి సోనమ్ కపూర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే.. ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను త్వరలో తల్లికాబోతున్నానని తెలియజేసింది. తన భర్తతో కలిసి ఉన్న ఫోటో ఒకటి ఆమె షేర్‌ చేసింది. తమ నాలుగు చేతులు అడ్డుపెట్టి సాధ్యమైనంత వరకు నిన్ను అన్ని విధాలుగా ఉత్తమంగా పెంచేందుకు శ్రమిస్తామని.. నీ ప్రతి గుండె సవ్వడిలో తమ రెండు హృదయాలు ధ్వనిస్తూనే ఉంటాయని తమ బిడ్డను ఉద్దేశించి సోనమ్ తెలిపింది. కుటుంబం మొత్తం నీపై

ప్రేమాభిమానాలు చూపిస్తూనే ఉంటుంది.. నిన్ను ఈ భూమి మీదకు స్వాగతించేందుకు తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని పేర్కొంది. సోనమ్ దంపతులకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు కంగ్రాట్స్‌ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుపెట్టింది సోనమ్. సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ అహుజను 2018లో పెళ్లాడింది. వివాహం అనంతరం కూడా ఆమె పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. సోనమ్ కపూర్‌ ఖాతాలో పలు హిట్ చిత్రాలున్నాయి. బాలీవుడ్‌లో టాప్‌ హీరోల సరసన నటించి అభిమానులను అలరించింది.

Also read: China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?

Also read: RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News