Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?

Akhil Agent OTT అఖిల్ ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ ఏడాది డిజాస్టర్‌ల లిస్ట్‌ టాప్ ప్లేస్‌లో ఏజెంట్ నిలిచేలా కలెక్షన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అక్కడ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 10:57 AM IST
  • ఈ వారం థియేటర్లో సందడే సందడి
  • క్లాస్, మాస్ ప్రేక్షకుల కోసం రెండు సినిమాలు
  • ఓటీటీలో అయినా అఖిల్ మెప్పిస్తున్నాడా?
Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?

Akhil Agent OTT ఈ వారం ఓటీటీ, థియేటర్లోకి కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తుండగా.. నందినీ రెడ్డి అన్ని మంచి శకునములే సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఇక ఓటీటీలో ఏజెంట్ సినిమా రాబోతోంది. నిహారిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ సైతం ఈ వారమే రానుంది. మొత్తానికి ఇటు ఓటీటీ అటు థియేటర్లో ఈ వారం సందడి వాతావరణం కనిపించబోతోంది.

నందినీ రెడ్డి ఓ బేబీ తరువాత మళ్లీ ఇంకో సినిమాను తీయలేదు. ఆ సినిమా కొరియన్‌ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఓ బేబీ పర్వాలేదనిపించింది. అయితే మళ్లీ ఇంత వరకు నందినీ రెడ్డి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. మళ్లీ తన స్టైల్లో ఓ లవ్ స్టోరీని తెరకెక్కించింది. సంతోష్ శోభన్, మాళవిక కాంబోలో అన్ని మంచి శకునములే అనే సినిమాను తీసింది. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విజయ్ ఆంటోని అంటే తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు సినిమా గుర్తుకు వస్తుంది. బిచ్చగాడు చిత్రం తరువాత విజయ్ ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేశాడు. కానీ ఇంత వరకు కూడా హిట్టు కొట్ట లేకపోయాడు. విజయ్ ఇప్పుడు బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేశాడు. ఈ మూవీ మే 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ హిట్ కొడతాడా? లేదా? అన్నది చూడాలి.

Also Read:  Paper Boy Director : అమ్మాయిల చేతుల్లోనే ఉంది.. కాస్టింగ్ కౌచ్ మీద డైరెక్టర్ కామెంట్లు వైరల్

ఓటీటీలో అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రం రాబోతోంది. సోనీ లివ్‌లో ఈ మూవీ మే 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్‌ను రాబడుతుందో చూడాలి. ఇక నిహారిక డెడ్ పిక్సెల్ కూడా రానుంది. ఇవి కాకుండా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌ సిరీస్‌లో భాగంగా ఫాస్ట్ ఎక్స్ అనే సినిమా కూడా మే 19న థియేటర్లోకి రానుంది. ఇలా కొత్త సినిమాలతో ఓటీటీ, థియేటర్లలో ఈ వారం సందడి నెలకొనేలా ఉంది.

Also Read:  Ram Charan Game Changer : అమ్మకు స్పెషల్ సర్ ప్రైజ్.. గేమ్ చేంజర్ సెట్‌ నుంచి ఫోటోలు షేర్ చేసిన నవీన్ చంద్ర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News