Anudeep KV Comments: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా అంటూ అనుదీప్ షాకింగ్ కామెంట్స్.. ఛీఛీ అంటూ!

Anudeep KV Comments on God Father: గాడ్ ఫాదర్ సినిమా బోరింగ్ అంటూ అనుదీప్ కేవీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 4, 2022, 02:37 PM IST
Anudeep KV Comments: గాడ్ ఫాదర్ బోరింగ్ సినిమా అంటూ అనుదీప్ షాకింగ్ కామెంట్స్.. ఛీఛీ అంటూ!

Anudeep KV Shocking Comments on God Father: డైరెక్టర్ అనుదీప్ కేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పిట్టగోడ అనే సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయినా సరే జాతి రత్నాలు సిద్ధం చేసుకుని దాన్ని నాగ అశ్విన్ ద్వారా వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ వరకు తీసుకువెళ్లి ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా చిట్టి అనే పాత్రలో నటించింది. అంతేకాక ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలకపాత్రలో నటించారు.  

ఈ సినిమా మొత్తాన్ని నవీన్ పోలిశెట్టి తన భుజాల మీద నడిపించాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక రకంగా అనుదీప్ క్రేజ్ మామూలుగా పెరిగిపోలేదు. ఆయన క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంటే కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ క్యాష్ అనుదీప్ అనే పేరు కూడా తెచ్చుకున్నాడు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక అనుదీప్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ అనే సినిమా మీద కామెంట్లు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. నిజానికి ఆయన మాట్లాడింది మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా గురించి కాదు కానీ అనుదీప్ కావాలనే కౌంటర్ వేశాడా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఇటీవల ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనుదీప్. శివ కార్తికేయన్ హీరోగా మరియ అనే ఉక్రెయిన్ నటి హీరోయిన్గా సత్యరాజు కీలకపాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు సహా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయితేనేమి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి ప్రస్తావించారు. అందరు గాడ్ ఫాదర్ సినిమా చూడలేదంటే వింతగా చూస్తున్నారు అని పేర్కొన్న అనుదీప్ ఆలస్యంగా సినిమా చూశానని చెప్పుకొచ్చాడు.

అయితే తనకు గాడ్ ఫాదర్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించలేదని సినిమా బోర్ కొట్టిందని చెప్పుకొచ్చాడు. దీంతో వెంటనే యాంకర్ గాడ్ ఫాదర్ బోర్ కొట్టడం ఏమిటి మీరు మాట్లాడేది దేని గురించి అని షాకయ్యి ఎవరు ఈ మాట అనలేదని అంటే అలాగే చాలా మంది ఉన్నారు కానీ ఎవరు బయట చెప్పడం లేదని అనుదీప్ చెప్పుకొచ్చాడు. అయితే మీరు మాట్లాడేది దేని గురించి అంటే తాను మాట్లాడేది హాలీవుడ్ గాడ్ ఫాదర్ సినిమా గురించి అంటూ బాంబు పేల్చాడు.

అయినా యాంకర్ కు డౌట్ వచ్చి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ గురించి కాదు కదా అంటే ఛీ ఛీ కాదు అంటూ కామెంట్ చేశాడు. ఈ విషయం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అనుదీప్ కావాలనే గాడ్ ఫాదర్ సినిమా విషయంలో ఇలా కామెంట్ చేశాడని మెగా ఫాన్స్ అంటున్నారు. అయితే నిజంగానే అనుదీప్ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని టార్గెట్ చేసి కామెంట్స్ చేశాడా? లేక పొరపాటున ఇంగ్లీష్ గాడ్ ఫాదర్ గురించి చెబుతూ చిరంజీవి సినిమాని ఛీ ఛీ అన్నాడా అనే విషయం మీద చర్చ జరుగుతుంది. కొంతమంది అనుదీప్ కి అనుకూలంగా కొంతమంది అనుదీప్ కి వ్యతిరేకంగా కూడా కామెంట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 

Also Read: Like Share & Subscribe Review: సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ

Also Read: Urvasivo Rakshasivo Review: అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమా ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News