Anushka Shetty Casting Couch: టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేను కూడా..! షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!!

Anushka Shetty Casting Couch కాస్టింగ్‌ కౌచ్‌పై అనుష్క శెట్టి మాట్లాడుతూ..  తెలుగు సినీ పరిశ్రమలో ఉందని నేను అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 12:20 PM IST
  • టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది
  • షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క
  • చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16 సంవత్సరాలు
Anushka Shetty Casting Couch: టాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. నేను కూడా..! షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క!!

Anushka Shetty comments about casting couch in Tollywood: భారత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కోన్న వేధింపుల గురించి 'క్యాస్టింగ్ కౌచ్' పేరుతో ఇప్పటికే ఎంతో మంది బయటపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల ఇండస్ట్రీలలో మహిళలు తమకు ఎదురైన వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. టాలీవుడ్‌లో నటి శ్రీ రెడ్డి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. ఆ ఘటన అనంతరం స్టార్ హీరోయిన్‌లు కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై పలు సందర్బాల్లో స్పందిస్తునారు. తాజాగాఆ జాబితాలో సీనియర్ హీరోయిన్, జేజమ్మ అనుష్క శెట్టి కూడా చేరారు. 

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్‌ కౌచ్‌పై అనుష్క శెట్టి మాట్లాడుతూ..  తెలుగు సినీ పరిశ్రమలో ఉందని నేను అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. అనుష్క మాట్లాడుతూ... 'నిజమే టాలీవుడ్‌లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అవకాశాలు ఇస్తామని చెప్పి.. హీరోయిన్‌లను లోబర్చుకునే సంస్కృతి ఉంది. నేను కూడా అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంది. అయితే నేను చాలా సూటిగా, నిక్కచ్చిగా ఉంటాను. అందుకే నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు' అని తెలిపారు. 

'టాలీవుడ్‌లో చాలా మంది మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను. చాలా ఇంటర్వ్యూలో కూడా పలువురు మాట్లాడారు. అయితే నేను చాలా సూటిగా ఉండడంతో నా దగ్గర ఎవరూ ఆ విషయం మాట్లాడలేదు' అని అనుష్క శెట్టి పేర్కొన్నారు. వివాదాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనుష్క.. క్యాస్టింగ్ కౌచ్‌పై తొలిసారి స్పందించడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అనుష్క ఇలా మాట్లాడం వెనుక కారణం ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందని గతంలో సమంత కూడా అన్నారు. 

నాగార్జున హీరోగా వచ్చిన 'సూపర్‌' సినిమాతో అనుష్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి, బిల్లా, డాన్, ఖలేజా, వేదం, మిర్చి, బాహుబలి, రుద్రమదేవి వంటి హిట్ సినిమాల్లో నటించారు. జీరో సైజ్‌, భాగమతి లాంటి మహిళ ఓరియంటెడ్‌ సినిమాల అనంతరం స్వీటీ చాలా గ్యాప్ తీసుకున్నారు. భాగమతి సినిమా తర్వాత ఏ సినిమాకు కమిట్‌ అవ్వలేదు. ప్రస్తుతం యువ హీరో నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తున్నారు. అనుష్క చిత్ర పరిశ్రమలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. 

Also Read: IND vs WI 1st T20: ఓపెనర్‌గా ఇషాన్.. రుతురాజ్‌కు నిరాశే! వెస్టిండీస్‌తో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!!

Also Read: Bappi Lahiri Telugu Songs: చిరంజీవికి మంచి హిట్స్ ఇచ్చిన బప్పి లాహిరి.. తెలుగు టాప్ సాంగ్స్ ఇవే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News