Kalasa Movie: కలశ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. డిసెంబర్ 15న విడుదల

Kalasa Movie Pre Release Event: కలశ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఫిలిం ఛాంబర్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మురళీ మోహన్.. ఈ మూవీ నుంచి 'ఓ చిట్టీ తల్లి' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 15న ఈ సినిమాద ఆడియన్స్ ముందుకు రానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 09:13 PM IST
Kalasa Movie: కలశ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. డిసెంబర్ 15న విడుదల

Kalasa Movie Pre Release Event: బిగ్‌బాస్‌ ఫేమ్‌ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో కొండ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కలశ’. చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై  డాక్టర్‌ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 15న ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో 'ఓ చిట్టీ తల్లి' అంటూ సాగే సాంగ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్‌ నటులు మురళీమోహన్‌ ఆవిష్కరించారు. అనంతరం కలశ మూవీ టైటిల్ సాంగ్‌ను దర్శకులు వీర శంకర్‌ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. దర్శకుడు రాంబాబు మంచి పర్‌ఫెక్షనిస్ట్ అని అన్నారు‌. అతను ఓ మంచి రచయిత అని.. ఏది కావాలో అదే తీస్తాడని అన్నారు. ఇది మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ అని విన్నానని.. కెమెరా వర్క్, సంగీతం విషయంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోందన్నారు. ఈ మూవీ చక్కటి విజయం సాధించి.. అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను ఇటీవల ఓ చిన్న మూవీకి సంబంధించి బెంగుళూరులో ప్రెస్‌మీట్‌కు వెళ్లానని.. అక్కడ కేవలం రెండో, మూడో కెమెరాలు, ఓ నలుగురు జర్నలిస్ట్‌లు మాత్రమే వచ్చారని తెలిపారు. వచ్చినవాళ్లు కూడా కాలుమీద కాలు వేసుకుని తాము చెప్పేది రాసుకోవడం కూడా లేదన్నారు. కానీ మన తెలుగు సినీ మీడియా అలా కాదని.. సినిమా చిన్నదైనా.. పెద్దదైనా దానికి మంచి ప్రమోషన్‌ ఇస్తున్నారని అభినందించారు. ఇక్కడన్న ఇన్ని కెమెరాలను, ఇంతమంది జర్నలిస్టు‌లను చూస్తుంటే సినిమాలకు ఎంత ప్రమోషన్ ఇస్తున్నారో తెలుస్తుందన్నారు. 

దర్శకులు వీరశంకర్‌ మాట్లాడుతూ.. ఈ మూవీలో 'చిట్టితల్లి' పాట చాలా ఎమోషనల్‌గా ఉందన్నారు. ఆడియన్స్‌కు కచ్చితంగా కనెక్ట్‌ అవుతుందని.. సినిమాలో కంటెంట్ చాలా బాగుందన్నారు. రాంబాబు తనకు ఈ లైన్ చెప్పినప్పుడే.. హిట్‌ మూవీ తీస్తున్నారని అనిపించిందన్నారు. సైకాలజికల్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలంటే కత్తిమీద సాము లాంటిందని.. ఇలాంటి సినిమాలకు సహకారం చాలా ముఖ్యమన్నారు. తప్పకుండా ఆడియన్స్‌ను కట్టిపడేసే మూవీ అవుతుందన్నారు. 

డైరెక్టర్‌ రాంబాబు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎగ్టైట్‌మెంట్‌ ఫీలయ్యానని.. ఇలాంటి డిఫరెంట్ పాయింట్‌తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదని ప్రొడ్యూసర్ రాజేశ్వరి చంద్రజ అన్నారు. ఇప్పటి వరకూ భారతీయ వెండితెరమీద ఇలాంటి డెఫరెంట్‌ పాయింట్‌తో ఏ సినిమా రాలేదు అని గర్వంగా చెప్పగలను. ఆడియన్స్‌కు మంచి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే  మూవీ అవుతుందన్నారు. ఈనెల 15న థియేటర్స్‌లో తప్పకుండా సినిమాను చూసి ఆదరించాలని కోరారు.
 
మురళీ మోహన్‌ దర్శకుల, నిర్మాత హీరో అని డైరెక్టర్ కొండా రాంబాబు అన్నారు. కొంచెం కూడా గర్వంలేని మహామనిషి అని అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. మూవీ చాలా బాగా వచ్చిందని.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. ఇలాంటి మంచి సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు హీరో అనురాగ్‌. కలశ డిఫరెంట్‌ జోనర్‌ మూవీ అని.. లవ్‌, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందన్నాడు. ఈ కార్యక్రమంలో భానుశ్రీ, సోనాక్షి వర్మ సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు పాల్గొన్నారు. 

Also Read: Vijay Devarakonda: విజయ దేవరకొండ పై అసభ్యకర వార్తలు... ప్రచారపు వ్యక్తి అరెస్ట్

Also Read: Honey with Garlic: రోజూ పరగడుపున ఈ మిశ్రమం తీసుకుంటే మెరుపువేగంతో అధిక బరువు మాయం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News